IIFT Course
-
కాకినాడలో ప్రతిష్టాత్మక IIFT విద్యాసంస్థ ఏర్పాటు
-
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్‌టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్‌టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్‌టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్‌టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్‌టీకి ఢిల్లీ, కోల్‌కతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్‌లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్‌ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్‌కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్‌హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్‌ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
ఆ నలుగురికి బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) కు చెందిన నలుగురు విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. టాప్ కంపెనీలు పాల్గొన్న ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఇన్సిస్టిట్యూట్‌కు చెందిన నలుగురు విద్యార్థులు రూ. 95 లక్షల వార్షిక ప్యాకేజీ(150,000 డాలర్లు ) సాధించారు. అలాగే ఏడుగురు విద్యార్థులకు సంవత్సరానికి 80,000 డాలర్ల ప్యాకేజీ సాధించారని వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ సాదించారని ఐఐఎఫ్‌టీ ప్రకటించింది. దక్షిణ అమెరికా, థాయ్‌లాండ్, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో వీరికి భారీ వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా బ్రిటీష్ టెలికాం, డిబిఎస్, గోద్రేజ్, హీరో మోటోకార్ప్, మదర్ డైరీ, షాపుర్జీ పల్లోంజి, టెట్రా పాక్, టివిఎస్ మోటార్స్ తదితర కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపార రంగంలోని వివిధ విభాగాలకు తమ విద్యార్థులను ఎంపిక చేశారని పేర్కొంది. దేశీయంగా రూ.18.27లక్షలు, అంతర్జాతీయంగా రూ.19.23 లక్షలు సగటు వార్షిక వేతనంగా ఉందని తెలిపింది. -
ఐఐఎఫ్‌టీ కోర్సుల వివరాలు..
మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సును పూర్తి చేసిన వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -బాలు, నిజామాబాద్. ప్రస్తుత జాబ్ మార్కెట్లో ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఒకటి. ఫైనాన్స్, అకౌంటింగ్ రంగాలకు సంబంధించి కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించే లక్ష్యంతో రూపొందించిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత బ్యాంకులు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మేనేజ్మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఈక్విటీ రీసెర్చ్ వంటి సంస్థల్లో మేనేజీరియల్ హోదాలో స్థిరపడొచ్చు. కామర్స్ బ్యాక్ గ్రౌండ్‌తో ఈ తరహా కోర్సులను పూర్తి చేసిన వారికి ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇంగ్లిష్‌పై పట్టు, కంప్యూటర్ పరిజ్ఞానం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కెరీర్లో రాణించవచ్చు. ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేసే కోర్సుల వివరాలను తెలపండి? : మోహన్, నర్సంపేట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కు న్యూఢిల్లీ, కోల్‌కతాలలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును అందిస్తుంది. అర్హత: గ్రాడ్యుయేషన్. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిస్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను కొన్ని రకాల సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లను కూడా ఐఐఎఫ్‌టీ ఆఫర్ చేస్తుంది. ఆన్లైన్ కోర్సుల ప్రాధాన్యత ఏమిటి? ఏయే ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సులను అందిస్తున్నాయి? :శ్రీధర్, నిర్మల్. ఉన్నత విద్య అంటే ఆసక్తి ఉన్నా.. అందుకు తగిన సమయం చిక్కని వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులకు ఆన్లైన్ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయి. దేశంలో ఏ మూల నుంచైనా ఈ కోర్సులను పూర్తి చేయొచ్చు. అంతేకాకుండా ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్ల పాఠాలను వినే అవకాశం కూడా లభిస్తుంది.ఆన్లైన్ కోర్సులను సెల్ఫ్-లెర్నింగ్ పద్ధతి లేదా ప్రొఫెసర్ కేంద్రకంగా ఉండే మాధ్యమంలో నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు అంతగా ప్రాముఖ్యం లేని సబ్జెక్ట్‌లలో ఈ కోర్సులను సాధారణంగా ఆఫర్ చేస్తారు. ఎంచుకున్న సబ్జెక్ట్‌ను బట్టి కాల వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొన్ని కోర్సులను వారాలపాటు నిర్వహిస్తే.. మరికొన్ని కోర్సులను పూర్తి చేయడానికి ఏడాది సమయం పట్టొచ్చు. ఆన్లైన్ డిగ్రీలకు జాబ్ మార్కెట్లో గుర్తింపు కూడా లభిస్తుంది. దేశంలోని చాలా ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్మెంట్ స్టడీస్‌కు సంబంధించి ఆఫర్ చేస్తున్న కోర్సులకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎక్స్ఎల్ఆర్ఐ), సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ అహ్మదాబాద్ (మైకా), సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఇండియా టుడే గ్రూప్ కూడా మీడియాతోపాటు వివిధ విభాగాలకు సంబంధించిన కోర్సులను ఆన్లైన్లో నిర్వహిస్తుంది. పీజీ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబాటులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -బాలా, మహబూబ్‌నగర్. పెట్రోలియం ఇంజనీర్ అభ్యర్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోలియం, సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడమనే మాట తలెత్తదు. డిమాండ్ పెరగడం అంటే తదనుగుణంగా నూతన ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే భావించాలి. కాబట్టి ఈ కోర్సును పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరు ఆయిల్ కంపెనీలు, గ్యాస్ పరిశ్రమలు, మైనింగ్ కంపెనీలు తదితరాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. పీజీ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. యూనివర్సిటీ ఆఫ్ పుణే, ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. వివరాలకు: www.unipune.ac.inరాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ-రాయ్‌బరేలీ, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. అర్హత: సంబంధిత అంశంలో బీటెక్. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వివరాలకు: www.rgipt.ac.in యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్- డెహ్రాడూన్, ఎంటెక్ (పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్) కోర్సును అందిస్తుంది. అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్ (కెమికల్/మెకానికల్) లేదా ఎంఎస్సీ (జియాలజీ/జియోఫిజిక్స్/ ఫిజిక్స్). అదేవిధంగా సీనియర్ సెకండరీ స్థాయిలో కూడా 60 శాతం మార్కులు కలిగి ఉండాలి. పీఓజీఎల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పెట్రోలియం అండ్ ఎనర్జీ డెవలప్మెంట్-గువహటి, ఎంఎస్సీ (పెట్రోలియం, పలు స్పెషలైజేషన్సతో) కోర్సును ఆఫర్ చేస్తుంది. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు: http://poglinstitute.org