సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) కు చెందిన నలుగురు విద్యార్థులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. టాప్ కంపెనీలు పాల్గొన్న ప్లేస్మెంట్ కార్యక్రమంలో ఇన్సిస్టిట్యూట్‌కు చెందిన నలుగురు విద్యార్థులు రూ. 95 లక్షల వార్షిక ప్యాకేజీ(150,000 డాలర్లు ) సాధించారు. అలాగే ఏడుగురు విద్యార్థులకు సంవత్సరానికి 80,000 డాలర్ల ప్యాకేజీ సాధించారని వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్‌నేషనల్ ప్లేస్‌మెంట్ సాదించారని ఐఐఎఫ్‌టీ ప్రకటించింది. దక్షిణ అమెరికా, థాయ్‌లాండ్, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో వీరికి భారీ వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు వెల్లడించింది. ముఖ్యంగా బ్రిటీష్ టెలికాం, డిబిఎస్, గోద్రేజ్, హీరో మోటోకార్ప్, మదర్ డైరీ, షాపుర్జీ పల్లోంజి, టెట్రా పాక్, టివిఎస్ మోటార్స్ తదితర కంపెనీలు తమ అంతర్జాతీయ వ్యాపార రంగంలోని వివిధ విభాగాలకు తమ విద్యార్థులను ఎంపిక చేశారని పేర్కొంది. దేశీయంగా రూ.18.27లక్షలు, అంతర్జాతీయంగా రూ.19.23 లక్షలు సగటు వార్షిక వేతనంగా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment