డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్‌ఈడీ- గతంలో డీఎడ్) ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో (డీఈఎల్‌ఈడీ- గతంలో డీఎడ్) ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలో 258 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉండగా, 10 ప్రభుత్వ డైట్ కాలేజీలు ఉన్నాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లో ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు ఉన్న 118 కాలేజీల్లోనే మొదటి దశలో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఈసేవా కేంద్రాల్లో బుధవారం నుంచి ఫీజు చెల్లించి, వారు ఇచ్చే జర్నల్ నంబరు సహకారంతో అందుబాటులో ఉన్న కాలేజీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మొదటి దశ వెబ్ ఆప్షన్లను 7 నుంచి 10వ తేదీ వరకు ఇచ్చు కోవచ్చు.