ఈనెల 25 బదులు 29 నుంచి వెబ్ ఆప్షన్లు
* సవరించిన షెడ్యూలు జారీ చేసిన జాయింట్ సీట్ అల కేషన్ అథారిటీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో ఒకేసారి చేపట్టే ఉమ్మడి ప్రవేశాల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్‌లో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ మార్పులు చేసింది. ఐఐటీ బాంబే ముందుగా ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుంచే ప్రారంభించాల్సిన వెబ్ ఆప్షన్లను (ఆన్‌లైన్ చాయిస్ ఫిల్లింగ్) ఈనెల 29 నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.
జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు ఈనెల 24నే విడుదల కావాల్సి ఉన్నా జాప్యం కావడంతో ఈ మార్పులు చేసింది. గురువారం ఢిల్లీలో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ అధికారులు, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అధికారులు సమావేశమై ఈ మేరకు మార్పులు చేశారు. తాజా షెడ్యూల్‌ను జేఈఈ అడ్వాన్స్‌డ్, జాయింట్ సీట్ అలకేషన్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఐఐటీల్లో జూలై 21 నుంచి, ఎన్‌ఐటీల్లో జూలై 27 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్ మార్పు
Published Fri, Jun 26 2015 2:02 AM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM
Advertisement