నేటి నుంచి బీ-ఫార్మసీ కౌన్సెలింగ్
15 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 18 వరకు వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్-డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 13 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులకు 20న సీట్లు కేటాయించనుంది. రాష్ట్రంలోని 173 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో బీఫార్మసీలో 2,060, ఫార్మ్-డీలో 330, బయో టెక్నాలజీలో 42 సీట్లు భర్తీ చేయనుంది.
వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్ కార్డు, టెన్త్ మెమో, ఇంటర్మీడియెట్ మెమో, టీసీ, 6వ తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయం సర్టిఫికెట్, కులం, నివాస ధ్రువీకరణ పత్రం, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి.
ఇదీ షెడ్యూల్..
15న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
15, 16న 1 నుంచి 25 వేల ర్యాంకు, 16, 17న 25,001 నుంచి 50 వేల ర్యాంకు, 17,18న 50,001 నుంచి చివరి ర్యాంకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 18న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 20న సీట్లు కేటాయిస్తారు.
ఇవీ హెల్ప్‌లైన్ కేంద్రాలు..
మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం (రుద్రంపూర్), వరంగల్, బెల్లంపల్లి, నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్‌లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కరీంనగర్‌లోని బీఆర్ ఆంబేడ్కర్ జీఎంఆర్ మహిళా పాలిటెక్నిక్, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ, చందూలాల్ బారాదరిలోని క్యూ క్యూ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామంతాపూర్‌లోని జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా భవన్.