Final Phase Polling
-
కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల చివరి విడత పోలింగ్
-
ప్రారంభమైన ఆఖరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్
-
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok Sabha Election 2024: నేడే తుదిపోరు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బిహార్ ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, పశి్చమబెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆఖరి దశలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అభిõÙక్ బెనర్జీ, మీసా భారతి, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
ఎగ్జిట్‌పోల్స్.. ఏం చెబుతాయో!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. శనివారం చివరి దశలో ఎన్నికలు జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. జూన్ ఒకటి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించకుండా న్యూస్ ఛానెల్‌లను ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందన్న దానిపై అంచనాలను వెల్లడించనున్నాయి. రాజకీయ పండితులు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) విజయం సాధిస్తుందని అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి చివరివరకు గట్టిగా పోరాడటంతో ఎగ్జిట్ పోల్స్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ సొంతంగా 303 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిసి 352 స్థానాలు గెలుచుకున్నాయి. -
పోలింగ్ ప్రక్రియ ఇంత సుదీర్ఘమా?
పట్నా: దేశంలో వేసవి ఎండల తీవ్రత మధ్య పోలింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. రెండుమూడు దశల్లోనే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ప్రస్తుతం పోలింగ్ బూత్‌ల వద్ద ఎటువంటి నీడా లేకపోవడంతో, ఓటర్లు మండే ఎండల్లో క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. పెద్ద దేశం, అందునా ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్‌ల్లో కొండ ప్రాంతాలు ఉన్నందున సాధారణ ఎన్నికలను రెండు లేక మూడు దశల్లోనే పూర్తి చేయాలి’ అని అన్నారు. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఎన్నికల నిర్వహణలోపంగా చూడరాదంటూ ఆయన.. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తయ్యాక మిగతా పార్టీల ఏకాభిప్రాయంతో ఈ అంశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఆర్జేడీతో సయోధ్యకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్‌ను తాను పంపించినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ తన ఆత్మకథలో పేర్కొనడాన్ని నితీశ్ తోసిపుచ్చారు. ‘ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ భూషణ్ ఎందరినో కలుస్తుంటారు. లాలూ పేర్కొన్న సమయంలో ప్రశాంత్ భూషణ్ మా పార్టీలో చేరనే లేదు’ అని తెలిపారు. -
ఈసీకి మోదీ కృతజ్ఞతలు
బద్రీనాథ్/కేదార్నాథ్/న్యూఢిల్లీ: తన ఉత్తరాఖండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం బద్రీనాథ్ వెళ్లేముందు ఆయన కేదార్‌నాథ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నిశ్శబ్ద సమయం’లో మోదీ చేపట్టిన పర్యటనపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనకు మీడియా పెద్దయెత్తున ప్రచారం కల్పించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. కాగా కేదార్‌నాథ్‌లో ధ్యానం సందర్భంగా తానేమీ కోరుకోలేదని, అది తన నైజం కాదని మోదీ చెప్పారు. డిమాండ్ చేయడం కాకుండా ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడని ఆయన అన్నారు. దేవుడు భారతదేశాన్నే కాకుండా యావత్ మానవాళి సంతోషంగా ఉండేలా దీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నానన్నారు. పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించడం తన అదృష్టమని, 2013లో వరుస వరదలతో కుదేలైన కేదార్‌నాథ్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బద్రీనాథ్‌లో 20 నిమిషాలు పూజ శనివారం కేదార్నాథ్ సందర్శించిన మోదీ సుమారు 20 గంటల పాటు అక్కడ గడిపిన తర్వాత ఆదివారం వైమానిక దళం హెలికాప్టర్లో బద్రీనాథ్ చేరుకున్నారు. ఆలయానికి సమీపంలోని ఐఏఎఫ్ హెలిప్యాడ్ వద్ద దిగిన ఆయన తర్వాత రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. ఆలయం లోపల గర్భగుడిలో పూజలు జరిపారు. ప్రధాని సుమారు 20 నిమిషాలు పూజలో పాల్గొన్నారని బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ చీఫ్ మోహన్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు. ఆలయ పూజారులు ఆయనకు భోజ చెట్టు ఆకులపై రూపొందించిన గ్రీటింగ్ కార్డును అందజేసినట్లు తెలిపారు. కాగా కొద్దిసేపు ఆలయం ఆవరణలో కలియతిరిగిన మోదీ భక్తులకు, స్థానికులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారని, ఆలయం వద్ద వేచి చూస్తున్న యాత్రికులను ప్రధాని కలిసారని వివరించారు. కాగా అతిథి గృహంలో ప్రధానితో భేటీ అయిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయం ఆవరణాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఓ వినతిపత్రం అందజేశారు. మీడియా కవరేజీపై టీఎంసీ ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడటం అనైతికమని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఆయన సందర్శనకు మీడియా కవరేజీ ఇవ్వడం ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రీన్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధాని పర్యటనకు మీడియా కవరేజీ ఇవ్వడం కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
చివరి విడతలో 64%
న్యూఢిల్లీ/సిమ్లా/వారణాసి: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ఆదివారం హింసాత్మకంగా ముగిసింది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 64.26 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏడో విడత ఎన్నికల్లో బెంగాల్ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, బిహార్ అట్టడుగున నిలిచిందని ఈసీ పేర్కొంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈసారి 58.05 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలోని 13 లోక్‌సభ స్థానాలతో పాటు పంజాబ్(13), పశ్చిమబెంగాల్(9), బిహార్(8), మధ్యప్రదేశ్(8), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్(3), చండీగఢ్(1) స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. తృణమూల్–బీజేపీ శ్రేణుల ఘర్షణ పశ్చిమబెంగాల్లోని 9 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు 1.49 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సందర్భంగా కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉత్తర కోల్‌కతాలోని గిరీశ్ పార్క్ పోలింగ్ కేంద్రం సమీపంలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబును విసిరారని బీజేపీ నేత రాహుల్ సిన్హా ఆరోపించారు. తనను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా భద్రతాబలగాలు అడ్డుకున్నాయని టీఎంసీ దక్షిణ కోల్‌కతా అభ్యర్థి మలా రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను కేంద్ర బలగాలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళుతుండగా తన కారును టీఎంసీ కార్యకర్తలు బుడ్జ్–బుడ్జ్ ప్రాంతం వద్ద ధ్వంసం చేశారని డైమండ్ హార్బర్ బీజేపీ అభ్యర్థి నిలంజన్ రాయ్ తెలిపారు. పంజాబ్‌లో కాల్పుల కలకలం.. సార్వత్రిక ఎన్నికల వేళ పంజాబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గురుదాస్‌పూర్, భటిండా లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ–అకాలీదళ్ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల సందర్భంగా భటిండాలోని తల్వండిసబో పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు తమపై కాల్పులు జరిపారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. పంజాబ్‌లోని పటియాలాలో అత్యధికంగా 64.18 శాతం పోలింగ్ నమోదుకాగా, అమృత్‌సర్‌లో 56.35 శాతం అత్యల్ప పోలింగ్ నమోదైంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో 64 శాతం పోలింగ్ నమోదైనట్లు పంజాబ్ ఎన్నికల ప్రధానాధికారి ఎస్.కరుణ రాజు తెలిపారు. లూథియానా, సమనా, మోగా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించగా, అధికారులు రిజర్వు ఈవీఎంలను వాడారని వెల్లడించారు. దళితులు ఓటేయకుండా అడ్డంకి.. ఏడో విడత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యల్ప పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈసారి 58.05 శాతం పోలింగ్ నమోదుకాగా, గోరఖ్‌పూర్‌లో 57.38 శాతం, సేవాపురిలో 61.60 శాతం, వారణాసి నార్త్ లో 55.75 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో మహరాజ్‌గంజ్ నియోజకవర్గం 62.40 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా, బల్లియా 52.50 శాతం పోలింగ్‌తో చిట్టచివరి స్థానంలో నిలిచింది. యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే నియోజకవర్గమైన చందౌలీలో బీజేపీ, సమాజ్‌వాదీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు చందౌలీలోని తారాజీవన్‌పూర్ గ్రామంలో దళితులు ఓటేయకుండానే వారి చేతివేలికి సిరాచుక్క వేస్తున్నారని ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదుచేశారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల బహిష్కరణ.. మధ్యప్రదేశ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని ఆరోపిస్తూ దేవాస్ ప్రాంతంలోని ఓ గ్రామం, మందసౌర్‌లోని ఐదు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. చివరికి సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో దేవాస్‌లో గ్రామస్తులు ఓటేశారు. పట్నాలో ఆదివారం ఓటేసిన అనంతరం మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్ వెళుతున్న కారు కొందరు జర్నలిస్టుల కాళ్లపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు సదరు వాహనంపై దాడిచేసి విండ్‌స్క్రీన్‌ను విరగ్గొట్టగా, తేజ్‌ప్రతాప్ ప్రైవేటు భద్రతాసిబ్బంది వారిని చితక్కొట్టారు.గత ఆరు విడతల్లో సగటున 66.88 శాతం పోలింగ్ నమోదుకాగా, ఏడో విడతలో 64.26 శాతం పోలింగ్ నమోదయింది. ఈసీ శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించింది. 102 ఏళ్ల నేగీ 17వ సారి స్వతంత్ర భారత తొలిఓటర్ శ్యామ్‌శరణ్ నేగీ (102) హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. 1951 నుంచి ఓటు వేస్తున్న నేగీ ఆదివారం 31వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకూ లోక్‌సభ ఎన్నికల్లో 17 సార్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 14 సార్లు నేగీ ఓటువేశారు. అవిభక్త కవలలు తొలిసారిగా వేర్వేరుగా బిహార్‌లోని పట్నాకు చెందిన అవిభక్త కవలలు సబాహ్–ఫరాహ్(25) తొలిసారి వేర్వేరుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకూ వీరిద్దరినీ ఒకరిగానే పరిగణించి ఓటర్ కార్డును జారీచేసేవారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వీరికోసం రెండు ఓటర్ ఐడీలను జారీచేశారు. ఓటేసిన అనంతరం సబాహ్–ఫరాహ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా పెద్దఎత్తున తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. వీరిద్దరూ ఓటేసేందుకు వీలుగా ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 909 పోస్టుల తొలగింపు లోక్‌సభ ఎన్నికలవేళ సామాజిక మాధ్యమాల నుంచి 909 పోస్టులను ఈసీ ఆదేశాలతో తొలగించారు. వీటిలో ఫేస్బుక్ నుంచి 650 పోస్టులను తొలగించగా, ట్విట్టర్లో 220, షేర్‌చాట్‌లో 31, యూట్యూబ్ నుంచి ఐదు, వాట్సాప్ నుంచి 3 పోస్టులను తొలగించామని ఈసీ సమాచార డీజీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా 647 వార్తలను పెయిడ్ న్యూస్‌గా గుర్తించామన్నారు. ఓటేసిన ప్రముఖులు: జస్టిస్ పినాకి చంద్రఘోష్ (లోక్‌పాల్ చైర్పర్సన్), వృద్ధ ఓటరు శ్యామ్ శరణ్ నేగీ (హిమాచల్ ప్రదేశ్), శత్రుఘ్న సిన్హా (పట్నా సాహిబ్ కాంగ్రెస్ అభ్యర్థి), మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ దంపతులు (కోల్‌కతా), 115 ఏళ్ల వృద్ధురాలు మైనా దేవి (ఉత్తరప్రదేశ్). -
కాసేపట్లో ముగియనున్న తుది దయ పోలింగ్
-
పోలింగ్ తుది దశ పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల అల్లర్లు
-
లోక్‌సభ ఎన్నికల తుదివిడత పోలింగ్ ప్రారంభం
-
నేడు లోక్‌సభ ఎన్నికల తుదివిడత పోలింగ్
-
ఆఖరి దశలో నువ్వా? నేనా?
ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు పాలకపక్షమైన బీజేపీకి, ప్రతిపక్షాలకు కూడా కీలకమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ దశలో అనుకూల పరిస్థితి ఉందని కొందరు చెబుతుంటే, బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని రాజకీయ పండితులు మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ పూర్తయ్యే 542 సీట్లలో బీజేపీ సహా ఎన్డీఏకు 240 వరకూ వస్తాయని, కాంగ్రెస్‌కు వంద మించవని ఓ పక్కఅంచనాలు నడుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకుగాని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు గాని మెజారిటీకి దగ్గరగా సీట్లు రాని పక్షంలో ఏ కూటమికీ చెందని ప్రాంతీయపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్లో గణనీయ మార్పులు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2017లో జేడీయూ, ఆర్జేడీ కూటమి సర్కారు రాజీనామా చేశాక మళ్లీ నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారులో జేడీయూతో బీజేపీ, ఎల్జేపీ చేతులు కలిపాయి. యూపీలో 13 సీట్లూ కీలకమే! ఇక్కడ ఆఖరి దశ పోలింగ్ జరిగే 13 సీట్లను గతంలో బీజేపీ గెలుచుకుంది. మీర్జాపూర్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ విజయం సాధించారు. కిందటేడాది గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఈ 13 సీట్లలో 8 చోట్ల మాయావతి నేతృత్వంలోని బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ) రెండో స్థానంలో నిలవగా, ఎస్పీ మూడు స్థానాల్లో ద్వితీయ స్థానం ఆక్రమించింది. కాంగ్రెస్, ఆప్ చెరొక స్థానంలో రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన దశల్లో మాదిరిగానే ఎస్పీ, బీఎస్పీ కూటమి అన్ని స్థానాల్లో కలిసి పోటీచేస్తూ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ ఒంటరి పోరు సాగిస్తోంది. ఈ దశలో పోలింగ్ జరిగే సీట్లలో ప్రధాని మోదీ రెండోసారి పోటీచేస్తున్న వారణాసి మళ్లీ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎస్పీ గట్టి అభ్యర్థులను బరిలో నిలపలేదు. మోదీ మెజారిటీ పెంచడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. బిహార్‌లో రెండు చోట్ల హోరాహోరీ చివరి దశలో పోలింగ్ జరిగే బిహార్‌లోని 8 నియోజకవర్గాలు: పట్నా సాహిబ్, పాటలీపుత్ర, ఆరా, జెహానాబాద్, కర్కట్, బుక్సర్, సాసారామ్, నలందాలో బీజేపీ కిందటిసారి తన పూర్వ మిత్రపక్షమైన రాష్ట్రీయలోక్‌సమతా పార్టీ(ఆరెలెస్పీ)తో కలిపి ఏడు సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి ఐదు, ఆరెలెస్పీకి రెండు దక్కాయి. జేడీయూ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆర్ఎల్ఎస్పీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కూటమిలో చేరింది. 2014లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పట్నా సాహిబ్ బరిలోకి దిగారు. ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో పాటలీపుత్రలో ఓడిపోయిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి(ఆర్జేడీ) మళ్లీ పోటీచేస్తున్నారు. గతంలో ఆమెను ఓడించిన ఆర్జేడీ మాజీ నేత రామ్‌కపాల్ యాదవ్ బీజేపీ టికెట్‌పై రెండోసారి పోటీకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ కూతురు, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మళ్లీ సాసారామ్ నుంచి పోటీకి దిగారు. 2014లో ఆమెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఛేదీ పాస్వాన్ ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సీఎం నితీశ్‌కుమార్ సొంతూరు కల్యాణ్బీఘా ఉన్న నలందా స్థానంలో మాత్రమే ఆయన పార్టీ గెలిచింది. కిందటిసారి పది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ మళ్లీ పోటీచేస్తుండగా, ఆయనకు మారిన పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంది. ఆయనకు ఆర్జేడీ కూటమిలోని హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) అభ్యర్థి అశోక్ కుమార్ ఆజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ బీజేపీ–జేడీయూ కూటమి, మహా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. మధ్యప్రదేశ్‌లో ఎనిమిదీ బీజేపీ గెలిచిన సీట్లే ఈ రాష్ట్రంలో చివరి దశలో పోలింగ్ జరిగే 8 సీట్లు: దేవాస్, ఉజ్జయినీ, మంద్సోర్, రత్లామ్, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖండ్వా. 2014లో ఈ ఎనిమిది స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సీట్లన్నీ మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. 2015లో రత్లామ్(ఎస్టీ) స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కిందటేడాది చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 66 స్థానాల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 21 సీట్లు కైవసం చేసుకున్నాయి. దళితులు, ఆదివాసీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని సీట్లలో రెండింటిని ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ స్థానమైన దేవాస్‌లో ప్రపంచ ప్రఖ్యాత కబీర్ దోహాల గాయకుడు ప్రహ్లాద్‌సింగ్ టిపానియా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన టిపానియా ఎన్నికల ప్రచారంలో తన పాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జనరల్ స్థానాలైన ఖండ్వా, ఇండోర్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఖండ్వాలో కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ నేత అరుణ్ యాదవ్(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్నారు. ఇండోర్ నుంచి గతంలో వరుసగా 8 సార్లు గెలిచిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీలో లేరు. మంద్సోర్ నుంచి 2009లో గెలిచిన యువజన కాంగ్రెస్ మాజీ నేత మీనాక్షీ నటరాజన్(కాంగ్రెస్) మూడోసారి బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బెంగాల్లో భీకర పోరు 2014లో మొత్తం 9 స్థానాలనూ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ దశ ఎన్నికల ప్రచారాన్ని తృణమూల్, బీజేపీ దూకుడుగా నిర్వహించాయి. అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 21 కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మోదీ–అమిత్‌షా ద్వయం బెంగాల్లో తృణమూల్ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటూ తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దమ్‌దమ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ తృణమూల్ సభ్యుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మళ్లీ పోటీలో ఉన్నారు. చివరి దశలోని అన్ని సీట్లలోనూ తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో 2014లో ఆప్ 4 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అకాలీ–బీజేపీ కూటమి ఐదు, కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, అకాలీదళ్–బీజేపీ కూటమి మధ్యనే ఉంది. అకాలీ మాజీ డెప్యూటీ సీఎం, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఫిరోజ్‌పూర్ నుంచి, సుఖ్బీర్ భార్య, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బఠిండా నుంచి, కేంద్ర మాజీ మంత్రి హర్దీప్సింగ్ పురీ(బీజేపీ)అమత్సర్ నుంచి పోటీకి దిగారు. పదేళ్ల తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అకాలీదళ్ కనీసం మూడు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది. వేడెక్కిన హిమాచల్ మొత్తం 4 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాం గ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. 2014లో నాలుగు సీట్లనూ(సిమ్లా, మండీ, హమీర్పూర్, కాంగ్ఢా) బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. బీజేపీ పాలనలోని హిమాచల్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వృద్ధ నేత సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్శర్మ మండీ నుంచి పోటీచేస్తుండగా, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధూమల్ కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ నుంచి మరోసారి పోటీకి దిగారు. ఝార్ఖండ్‌లో ఆదివాసీ సీట్లు రెండు ఈ రాష్ట్రంలోని 14 సీట్లలో చివరి 3 స్థానాలకు ఆఖరి దశలో పోలింగ్ జరుగుతోంది. రాజ్‌మహల్, దూమ్కా ఆదివాసీలకు రిజర్వ్ చేసిన స్థానాలు. మూడో సీటు గొడ్డా జనరల్ నియోజకవర్గం. 2014లో ఎస్టీ సీట్లు రెండింటిని మాజీ సీఎం శిబూ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కైవసం చేసుకుంది. గొడ్డాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించి తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా బీజేపీ–ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి అన్ని సీట్లకూ పోటీచేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, ఆర్జేడీతో పాటు తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నాయకత్వంలోని జేవీఎం(పీ) చేరింది. కూటమి తనకు కేటాయించని ఒక సీటులో ఆర్జేడీ పోటీకి దిగింది. చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ ఎదురీత? 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో విజయం సాధించిన సినీనటి కిరణ్ ఖేర్(బీజేపీ) ప్రస్తుత ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఓటర్లలో, పార్టీ కార్యకర్తల్లో ఆమెపై అసంతృప్తి కారణంగా ఆమె గెలుపునకు బాగా కష్టపడాల్సి వస్తోంది. 2019లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఆమెపై కాంగ్రెస్ పాత ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పోటీచేస్తున్నారు. ఆప్ తరఫున బలమైన అభ్యర్థి హర్మోహన్ ధవన్ బరిలోకి దిగారు. కిందటిసారి తన ప్రత్యర్థులిద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో కిరణ్ 69 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో నాలుగుసార్లు చండీగఢ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సల్‌పై కూడా వ్యతిరేకత ఉంది. -
నేడే పరిషత్ తుది పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిషత్ పోరు చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం ఎన్నికల పోలింగ్ ముగియనుంది. 27 జిల్లాల పరిధిలోని 161 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 1,738 ఎంపీటీసీ స్థానాల్లో 5,726 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. చివరి విడతలో దాదాపు 46.64 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎస్ఈసీ పూర్తిచేసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. ఈనెల 27న ఉదయం 8 గంటలకు మూడు విడతల పరిషత్ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సోమవారం రూ.5.16 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.1.02 కోట్ల విలువైన నగదు, రూ.1.01 కోట్ల విలువైన ఇతర వస్తువులను పోలీసులు, ఎన్నికల అధికారులు జప్తుచేశారు. గ్రామ, మండల స్థాయిల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. -
ఓటోత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు విలువపై యువత చైతన్యమైంది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు పొందేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. ఆరు నెలల్లోనే రెండు లక్షలకుపైగా యువత నూతన ఓటర్లుగా నమోదు కావడం విశేషం. ఎన్నికల విభాగం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 31 వరకు కొత్తగా 2.05 లక్షల మంది ఓటు హక్కు పొందారు. ఇందులో 90 శాతం మంది 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగు పెట్టినవారేనని అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రాంత, మార్చిలో గ్రామీణ ప్రాంత ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. ఆ సమయంలో జిల్లా ఓటర్లు 24.50 లక్షలు. ఆ తర్వాత చాలా మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై విస్తృతంగా చైతన్యం కల్పించాలి. ఓటరుగా నమోదు చేసుకునేందుకు కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులను సైతం నిర్వహించారు. వీటి ఫలితం గానే కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 26.56 లక్షలు. అభ్యంతరాల స్వీకరణ.. ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ముసాయిదా ప్రతులను అన్ని గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ని (ఆర్డీఓ) నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచేందుకు యంత్రాంగం ఏర్పా ట్లు చేస్తోంది. కలెక్టరేట్ నుంచి ప్రతులను ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే తుది జాబితాను విడుదల చేస్తారని పేర్కొన్నారు. నమోదుకు మరోసారి అవకాశం.. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఓటు హక్కు పొందాలంటే జిల్లా పరిధిలో ఏదేని ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. పుట్టిన తేదీ, నివాస చిరునామా ఉంటే సరిపోతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. లేదంటే మీ–సేవ ద్వారాగాని ఓటు హక్కు పొందవచ్చు. అక్టోబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
యూపీ ఆఖరి దశలో ఓటేసిన ప్రముఖులు
-
నేడే యూపీ, మణిపూర్లలో తుదిదశ పోలింగ్
-
నేడే యూపీ, మణిపూర్లలో తుదిదశ పోలింగ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆఖరి దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగే ఉత్తరప్రదేశ్ ఏడో దశ, మణిపూర్ రెండో దశ పోలింగ్‌లతో శాసనసభ ఎన్నికలు ముగుస్తాయి. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 4న మొదలైంది. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న, ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 15న ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల ఫలితాలు మార్చి 11న వెల్లడవుతాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏడు జిల్లాల్లోని మొత్తం 40 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఆలాపూర్ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో పోలింగ్ గురువారానికి వాయిదా పడింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోనూ చివరిదైన రెండో దశ పోలింగ్ బుధవారం జరగనుంది. ఇక్కడ మొత్తం 22 సీట్లకు రెండో దశలో ఎన్నికలు జరుగుతాయి. సైనిక బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సుదీర్ఘకాలం నిరాహార దీక్ష సాగించిన ఉద్యమకారిణి ఇరోం చాను షర్మిల తౌబాల్ నుంచి పోటీ చేస్తున్నారు. -
మార్చి 9 నుంచి బడ్జెట్ సమావేశాల మలి దశ
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ మార్చి 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్(మార్చి 8) ముగిసిన తర్వాతి రోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్ని జనవరి 31న ప్రారంభించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇంతకుముందే సూచించింది. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతాయి. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు
హైదరాబాద్ సిటీ: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులోని ఆరుగురు నిందితులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు వారు నమోదుచేశారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నేడు తుది తీర్పు
-
ఫైనల్ రౌండ్ లో వెరిజోన్, ఏటీ అండ్ టీ ఢీ
యాహు కోర్ ఇంటర్నెట్ ఆస్తుల వేలం పాటలో అమెరికా టెలి కమ్యూనికేషన్ దిగ్గజ సంస్థలు వెరిజోన్ కమ్యూనికేషన్, ఏటీ అండ్ టీ పోటీపడనున్నాయి. ఈ రెండు టెలికం సంస్థలు వేలం బిడ్డింగ్ లో చివరి రౌండ్ కు రానున్నాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వెరిజోన్, అమెరికాలో అతిపెద్ద వైర్ లెస్ క్యారియర్ గా ఉండగా.. ఏటీ అండ్ టీ రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ. ఈ రెండు సంస్థలు ఇప్పుడు యాహు బిడ్డింగ్ పై పోటీపడనున్నాయి. యాహు బిడ్డింగ్ ను ఈ రెండు సంస్థలు చాలెంజ్ గా తీసుకున్నాయి. గతవారమే ఈ వేలం రెండో రౌండ్‌ను యాహు ముగించుకుంది. ఈ రౌండ్ బిడ్స్ రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య నమోదయ్యాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వచ్చే నెలలో ఈ వేలాన్ని ముగించేయాలని యాహు భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ హెడ్జ్ ఫండ్ స్టాండర్డ్ విలువ పడిపోవడంతో తన ఆస్తుల అమ్మకం మొదలుపెట్టింది. కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు సెకండ్ రౌండ్ కు వెళ్లినా, మూడో రౌండ్ కు తమ జాబితాను నమోదు చేసుకోలేకపోయాయి. ఈ బిడ్స్ దాఖలును అధికారికంగా చేపట్టినట్టు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాహు, వెరిజోన్, ఏటీ అండ్ టీలు తిరస్కరించాయి. ఈ బిడ్డింగ్ కు క్వికెన్ లోన్స్ ఇంక్ వ్యవస్థాపకుడు డాన్ గిల్బర్ట్ కన్సార్షియంగా వ్యవహరిస్తున్నారు. -
బిహార్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పాట్నా : బీహార్ అసెంబ్లీకి తుది విడత ఎన్నికల పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తుది దశ ఎన్నికల పోలింగ్ లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని మొత్తం 57 స్థానాలకుగాను 827 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిచారు. సీమాంచల్‌లోని 24 స్థానాలు... మిథిలాంచల్తోపాటు కోషి ప్రాంతాల్లోని 33 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం భారీగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గతనెల అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు దశల్లో 243 స్థానాలకు గాను 186 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది నవంబర్ 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తెలనుంది. -
ఇక మిగిలింది ముస్లిం, యాదవుల చేతిలోనే!
పాట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న బీహార్ ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. గురువారం ఐదో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇది పూర్తయితే, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్లే. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల ఎన్నికలు ఒక ఎత్తుకాగా, ఈ ఐదో దశ మాత్రం మరోఎత్తు. ఎందుకంటే, గురువారం ఎన్నికలు జరగనున్న 57 నియోజవర్గాలు కూడా ముస్లింల, యాదవుల హవా ఉన్న ప్రాంతాలు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ది కూడా యాదవుల సామాజిక వర్గం కావడంతో మిగితా నియోజవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా ఈ నియోజవర్గాల్లో మాత్రం మోదీ హవా కన్నా నితీశ్, లాలూ హవా కొనసాగే అవకాశం ఉంది. పైగా దేశ వ్యాప్తంగా మోదీ ప్రభావం ఉన్న సమయంలోనే ఇక్కడ బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయి చతికిలపడింది. ఇప్పటికే ఓ వ్యూహం ప్రకారమే ముస్లిం వ్యతిరేక చర్యలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని దేశ వ్యాప్తంగా నిరసనలు రచ్చకెక్కడం కూడా బీజేపీకి కొంత ప్రతికూలంగా ఉన్న అంశం. మరోపక్క, తొలిసారి బరిలోకి దిగిన హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ తమ పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టి బీజేపీపై ముస్లింలకు ఉన్న వ్యతిరేకతను తమకు ఓట్లుగా మార్చుకునే దిశగా ముందడుగులో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో నిరక్షరాస్యత, పేదరికంతో నిండిఉండటమే కాకుండా వలసదారులు కూడా అధికమే. సిమాంచల్, కిషన్ గంజ్, పుర్నియా, ఖతిహార్, అరేరియాలో ఎక్కువగా ముస్లింలు ఉండగా, మదిపురా, సహస్రాలో ఎక్కువగా యాదవులు ఉన్నారు. ముస్లింలు, యాదవులు మాత్రమే ఈ నియోజకవర్గాల్లో కీలక పాత్ర పోషిస్తారని ప్రముఖ రాజకీయ వేత్త మహేందర్ యాదవ్ కూడా అన్నారు. దీంతో మొత్తం ఏడు జిల్లాల్లో జరగనున్న తుది పోరులో ఓటర్లు ఏ పార్టీల అభ్యర్థిని పలకరిస్తారనేది తెలుసుకునేందుకు ఫలితాలు వెల్లడయ్యేవరకు ఎదురుచూడాల్సిందే. -
ఇక మిగిలింది టగ్ ఆఫ్ వారే!
పుర్నియా: ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల బీహార్ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాల విషయంలో ఆ పార్టీ నేతలు ఎంతో ధైర్యంగా ఉన్న ఐదో దశ ఎన్నికల విషయంలో మాత్రం ఆ పార్టీ నేతలు కొంత తడబడుతున్నారు. ఎందుకంటే ఐదో దశ(చివరి దశ) ఎన్నికలు జరగనుంది సీమాంచల్ ప్రాంతంలో. 2014లో దేశమంతా ప్రధాని నరేంద్రమోదీ హవా వీస్తున్నా.. ఒక్క సీమాంచల్ మాత్రం ఎన్డీయే ప్రభావం పెద్దగా కనిపించకుండా పోయి నాలుగు ఎంపీ స్థానాలను కోల్పోయి భంగపడింది. ఇక్కడ మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకోసం గురువారం చివరి దశ ఎన్నికల పోరు జరగనుంది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఓటర్లు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరోపక్క, ఇక్కడ కేవలం ప్రధాన పోటీ ఒక్క బీజేపీ నితీశ్ కుమార్ కు మధ్య మాత్రమే కాకుండా జన అధికార్ పార్టీ(జేఏసీ) నేత పప్పు యాదవ్, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ కూడా ఆరు చోట్ల తన పార్టీ మజ్లిస్ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లుగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం సీమాంచల్‌లో ఉంటుందేమో వేచి చూడాల్సిందే. -
5 నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: ఏపీ లాసెట్, పీజీ ఎల్ సెట్ -2015 తుదివిడత కౌన్సెలింగ్ అక్టోబర్ 5వ తేదీనుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్ధులు అయిదో తేదీన సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకోవాలని పేర్కొన్నారు. 5, 6 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలని, అడ్మిషన్ల ప్రాసెసింగ్‌ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యరుధలు 450, ఇతరులు 900 చెల్లించాలన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెబ్‌కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ , గుంటూరు నాగార్జునవర్సిటీలలో ఈ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు http://aplawcet.apsche.ac.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9490332169ను సంప్రదించాలన్నారు. -
కశ్మీర్, జార్ఖండ్‌లో నేడే చివరి పోలింగ్
జమ్మూ/రాంచీ: జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ శాసనసభలకు ఐదు దశల ఎన్నికల్లో భాగంగా శనివారం చివరిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. జమ్మూ కశ్మీర్లో 3 సరిహద్దు జిల్లాల్లోని 20 అసెంబ్లీ సీట్లకు జార్ఖండ్‌లో ఆరు జిల్లాల్లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరగనున్న ఐదవ దశ పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కశ్మీర్లో ఇప్పటివరకూ జరిగిన నాలుగుదశల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనందున, ఐదవ దశలో కూడా భారీగానే పోలింగ్ జరగవచ్చని భావిస్తున్నారు. చివరిదశలో 18లక్షల మందికిపైగా తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా 2,366 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లో శనివారం 16 సీట్లకు జరగనున్న పోలింగ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)నేత హేమంత్ సోరెన్, స్పీకర్ శశాంక్ శేఖర్ భోక్తా, రాష్ట్ర మంత్రి లోబిన్ హెంబ్రోమ్ తదితర ప్రముఖులు సహా 208 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. -
రేపే తుది దశ పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరిదైన తొమ్మిదో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రాష్ట్రాల్లోని 41 స్థానాల్లో సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లో 18 లోక్‌సభ స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 17 స్థానాలు, బీహార్‌లో 6 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సహా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న హిందువుల ఆధ్యాత్మిక నగరం వారణాసి స్థానం యావత్ దేశం దష్టిని ఆకర్షిస్తోంది. హిందువుల ఓట్లపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని సుమారు 3 లక్షల మంది మైనారిటీలు ఉన్నారు. మొత్తం 606 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 9 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. తొమ్మిదో దశ పోలింగ్‌తో సుమారు 35 రోజులపాటు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు తెరపడనుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు మినహా మొత్తంమీద గత ఎనిమిది దశల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ ఎనిమిది దశల్లో సగటున 66 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు 16న జరుగనుంది. -
31న ఓటర్ల తుది జాబితా
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల తుది జాబితా ప్రకటన ఈ నెల 31వ తేదీకి వాయిదా పడింది. సవరణకు 30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలనకు సమయం పడుతున్నందున జాబితా ప్రకటనను వాయిదా వేసినట్లు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు గురువారం పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఈ నెల 17 వరకు సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు. -
నేడు కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు
-
కృష్ణా జలాల పంపిణీపై నేడు తుది తీర్పు
‘బ్రజేశ్‌కుమార్’ మధ్యంతర తీర్పులో మన రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేకాంశాలు.. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన రాష్ట్రం అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోకుండా తీర్పునిస్తే కృష్ణా రైతులకు తీవ్ర నష్టం ‘రాష్ట్ర విభజన’ నేపథ్యంలో తీర్పునకు ప్రాధాన్యత సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా సంబంధిత రాష్ట్రాల వాదనలను వింటున్న బ్రజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ శుక్రవారం తుది తీర్పును ప్రకటించనున్నది. అరుుతే ఏ విధమైన తీర్పు వెలువడనుందనే అంశమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువడితే మాత్రం రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనేక అంశాలు ఉన్నాయి. వీటి పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తుది తీర్పు సందర్భంగా వీటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఆయూ అంశాలను సవరించని పక్షంలో.. రాష్ర్టంలో కృష్ణా జలాలపై ఆధారపడిన రైతాంగం తీవ్రంగా నష్టపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పునకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ట్రిబ్యునల్ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై తీర్పును వెల్లడించనుంది. ఈ దృష్ట్యా రాష్ట్రం తరఫున నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ రవూఫ్ తదితర అధికారులు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఇదీ నేపథ్యం... కృష్ణానది నీటి వాడకంపై మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో నీటి పంపకాలపై 1969లో ఆర్ఎస్ బచావత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రిబ్యునల్ 1973లో తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును పునఃపరిశీలించాలని 2002లో మూడు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ క్రమంలో 2004 ఏప్రిల్ 2వ తేదీన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. జస్టిస్ ఎస్పీ శ్రీవాస్తవ, జస్టిస్ డీకే సేథ్‌లు సభ్యులుగా ఉన్నారు. అప్పటినుంచి పలుమార్లు సమావేశమైన ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాల వాదనలను విన్నది. 2010 డిసెంబర్ 30న మధ్యంతర తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో పలు అంశాలు మన రాష్ర్ట ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం సవరణలకు డిమాండ్ చేసింది. గత మూడేళ్లుగా సవరణలపై వాదనలను కొనసాగాయి. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చాయి. ఈ నేపథ్యంలో తుది తీర్పు ప్రకటనకు ట్రిబ్యునల్ సిద్ధమైంది. ఆలమట్టిని నియంత్రిస్తారా? మధ్యంతర తీర్పులో మనం తీవ్రంగా వ్యతిరేకించిన అంశం ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానదిపై మన ప్రాంతానికి ఎగువున నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల మనకు సకాలంలో నీరు రావడం ఆగిపోతుంది. ఇప్పటికే 519.6 మీటర్లు ఉన్న ఈ డ్యాం ఎత్తును 524.24 మీటర్లకు పెంచుకునేందుకు ట్రిబ్యునల్ అంగీకరించింది. దీనివల్ల కర్ణాటక ప్రభుత్వం అదనంగా మరో 103 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది. దిగువకు వచ్చే నీటి ప్రవాహం గణనీయంగా పడిపోతుంది. అలా జరిగితే కృష్ణానదిపై మన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మిగులు జలాలతోనే మన భవిష్యత్తు! రాష్ర్టంలో కృష్ణానదిపై ఆధారపడిన ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో మిగులు జలాలను ఆధారంగా చేసుకుని కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టాం. వీటి కోసం సుమారు 227 టీఎంసీల నీరు అవసరం ఉంది. మొదటి ట్రిబ్యునల్ (బచావత్) ప్రకారం ఈ నీటిని వాడుకునే స్వేచ్ఛ మనకు మాత్రమే ఉంది. కానీ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో మిగులు జలాలను ఎగువ ప్రాంతాలకు కూడా పంపిణీ చేసింది. ఇదే తీర్పు అమల్లోకి వస్తే మనకు మిగులు జలాలు అందుబాటులో ఉండవు. దాంతో పైన పేర్కొన్న ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎగువ రాష్ట్రాలకు మిగులు జలాల పంపిణీని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదించింది. 65% డిపెండబులిటీపై తీవ్ర అభ్యంతరం.. మరోవైపు ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచడానికి వీలుగా ప్రస్తుత ట్రిబ్యునల్ నీటి లభ్యతను అంచనా వేయడంలో కొత్త పద్దతిని అనుసరించింది. సాధారణంగా నదిలో నీటి లభ్యతను అంచనా వేయడానికి 75 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం డిపెండబులిటీ పద్దతిని అనుసరించింది. ఆ మేరకు నదిలో నీరు ఎక్కువగా ఉందంటూ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచింది. ఈ విధంగా 65 శాతం డిపెండబులిటీ పద్దతిని అనుసరించడాన్ని కూడా రాష్ర్టం తీవ్రంగా వ్యతిరేకించింది. సకాలంలో నీటి విడుదలకు ఆదేశిస్తుందా? కర్ణాటకలో ఆలమట్టి అందుబాటులోకి వచ్చినందున మన ప్రాజెక్టులకు సకాలంలో నీటి విడుదల అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఆలమట్టి నిండే వరకు నీటిని దిగువకు విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రాజెక్టులకు నీరు రాదు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగానే నీటి విడుదల విషయంలో కాలపరిమితులను నిర్దేశించాల్సిందిగా రాష్ట్రం ట్రిబ్యునల్‌ను కోరింది. నియంత్రణ బోర్డుకు విస్తృత అధికారాలు ఉంటాయా ? కృష్ణా జలాల వాడకంపై ప్రత్యేక నియంత్రణ బోర్డును ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో సూచించింది. బోర్డులో ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు, కేంద్ర అధికారులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. అయితే ఈ మేరకు ఏర్పడబోయే బోర్డుకు సంక్రమించే అధికారాలపైనే దిగువ రాష్ర్టం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికే తుంగభద్ర బోర్డు నామమాత్రంగా పని చేస్తున్న అనుభవం మనకు ఉంది. ఎగువ ప్రాంతంవారు ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కొత్తగా ఏర్పడబోయే కృష్ణానది నియంత్రణ బోర్డు కూడా విస్తృతాధికారాలు లేకుండా తుంగభద్ర బోర్డులాగే ఉంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ముగిసిన ఎన్నికల పంచాయతి పోలింగ్
-
నేడు పంచాయతీ తుది పోరు