ఫైనల్ రౌండ్ లో వెరిజోన్, ఏటీ అండ్ టీ ఢీ | Verizon and AT and T Are Reportedly Through to the Final Round of Yahoo Bidding | Sakshi
Sakshi News home page

ఫైనల్ రౌండ్ లో వెరిజోన్, ఏటీ అండ్ టీ ఢీ

Published Mon, Jun 13 2016 5:11 PM | Last Updated on Tue, Oct 2 2018 4:13 PM

యాహు కోర్ ఇంటర్నెట్ ఆస్తుల వేలంపాటలో అమెరికా టెలి కమ్యూనికేషన్ దిగ్గజ సంస్థలు వెరిజోన్ కమ్యూనికేషన్, ఏటీ అండ్ టీలు పోటీపడనున్నాయి.

యాహు కోర్ ఇంటర్నెట్ ఆస్తుల వేలం పాటలో అమెరికా టెలి కమ్యూనికేషన్ దిగ్గజ సంస్థలు వెరిజోన్ కమ్యూనికేషన్, ఏటీ అండ్ టీ పోటీపడనున్నాయి. ఈ రెండు టెలికం సంస్థలు వేలం బిడ్డింగ్ లో చివరి రౌండ్ కు రానున్నాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి.  వెరిజోన్, అమెరికాలో అతిపెద్ద వైర్ లెస్ క్యారియర్ గా ఉండగా.. ఏటీ అండ్ టీ రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ. ఈ రెండు సంస్థలు ఇప్పుడు యాహు బిడ్డింగ్ పై పోటీపడనున్నాయి. యాహు బిడ్డింగ్ ను ఈ రెండు సంస్థలు చాలెంజ్ గా తీసుకున్నాయి.

గతవారమే ఈ వేలం రెండో రౌండ్‌ను యాహు ముగించుకుంది. ఈ రౌండ్ బిడ్స్ రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య నమోదయ్యాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వచ్చే నెలలో ఈ వేలాన్ని ముగించేయాలని యాహు భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ హెడ్జ్ ఫండ్ స్టాండర్డ్ విలువ పడిపోవడంతో తన ఆస్తుల అమ్మకం మొదలుపెట్టింది. కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు సెకండ్ రౌండ్ కు వెళ్లినా, మూడో రౌండ్ కు తమ జాబితాను నమోదు చేసుకోలేకపోయాయి. ఈ బిడ్స్ దాఖలును అధికారికంగా చేపట్టినట్టు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాహు, వెరిజోన్, ఏటీ అండ్ టీలు తిరస్కరించాయి. ఈ బిడ్డింగ్ కు క్వికెన్ లోన్స్ ఇంక్ వ్యవస్థాపకుడు డాన్ గిల్బర్ట్ కన్సార్షియంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement