అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించారు. ఎటీ అండ్ టీ, వెరిజోన్ కలిసీ కొత్త 5జీ సేవలను అందించడానికి సిద్ధం అవుతున్నప్పుడు రాబోయే "విపత్కర" విమానయాన సంక్షోభం గురించి ప్రధాన విమానయాన కంపెనీల సీఈఓలు ప్రభుత్వానికి సూచించారు. 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ వల్ల విమాన సేవలు నిలిచిపోతాయని, విమానాల విషయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్లు విమానయాన సంస్థలు హెచ్చరించాయి.
అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా రాశారు.. "మా విమానాలు ఎగరడానికి గ్రౌండ్ క్లియర్ చేయకపోతే, విమనాలలో ప్రయాణిస్తున్న ప్రజలు ఎక్కడిక్కడే చిక్కుకొని పోవల్సి వస్తుంది" అని అన్నారు. ఈ 5జీ సిగ్నల్స్ ఆల్టిమీటర్స్ వంటి సున్నితమైన విమాన పరికరాలను ప్రభావితం చేస్తుందని, దృశ్యమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఎఫ్ఏఏ హెచ్చరించింది. 1,100కు పైగా విమానాల ప్రయాణం స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు సంస్థలు సూచిస్తున్నాయి. "నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి.
ఈ లేఖపై ప్రభుత్వ సంస్థలు వెంటనే వ్యాఖ్యానించలేదు. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్న ఎటీ అండ్ టీ, వెరిజోన్ విమానయాన భద్రతను దృష్టిలో ఉంచుకొని 5జీ నెట్వర్క్ విస్తరణను రెండు వారాలపాటు పొడగించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత అక్కడ 5జీ టవర్స్ ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి.
(చదవండి: కష్టకాలంలో శ్రీలంకకు మరోసారి అండగా నిలిచిన భారత్..!)
Comments
Please login to add a commentAdd a comment