FCC
-
5జీ దెబ్బకు విమాన సేవలకు బ్రేక్..!
అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించారు. ఎటీ అండ్ టీ, వెరిజోన్ కలిసీ కొత్త 5జీ సేవలను అందించడానికి సిద్ధం అవుతున్నప్పుడు రాబోయే "విపత్కర" విమానయాన సంక్షోభం గురించి ప్రధాన విమానయాన కంపెనీల సీఈఓలు ప్రభుత్వానికి సూచించారు. 5జీ టెక్నాలజీలో వినియోగించే కొత్త సీ-బ్యాండ్ వల్ల విమాన సేవలు నిలిచిపోతాయని, విమానాల విషయంలో గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నట్లు విమానయాన సంస్థలు హెచ్చరించాయి. అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలా రాశారు.. "మా విమానాలు ఎగరడానికి గ్రౌండ్ క్లియర్ చేయకపోతే, విమనాలలో ప్రయాణిస్తున్న ప్రజలు ఎక్కడిక్కడే చిక్కుకొని పోవల్సి వస్తుంది" అని అన్నారు. ఈ 5జీ సిగ్నల్స్ ఆల్టిమీటర్స్ వంటి సున్నితమైన విమాన పరికరాలను ప్రభావితం చేస్తుందని, దృశ్యమాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని ఎఫ్ఏఏ హెచ్చరించింది. 1,100కు పైగా విమానాల ప్రయాణం స్తంభించిపోయే అవకాశం ఉన్నట్లు సంస్థలు సూచిస్తున్నాయి. "నిస్సంకోచంగా చెప్పాలంటే దేశం వాణిజ్యం ఆగిపోతుంది" అని కంపెనీలు వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రియాన్ డీస్, రవాణా కార్యదర్శి పీట్ బుట్టిగీగ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ డిక్సన్, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) చైర్మెన్ జెస్సికా రోసెన్‌వోర్సెల్‌లకు లేఖ రాశాయి. ఈ లేఖపై ప్రభుత్వ సంస్థలు వెంటనే వ్యాఖ్యానించలేదు. గత ఏడాది 80 బిలియన్ల డాలర్లను వెచ్చించి మొత్తం సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గెలుచుకున్న ఎటీ అండ్ టీ, వెరిజోన్ విమానయాన భద్రతను దృష్టిలో ఉంచుకొని 5జీ నెట్వర్క్ విస్తరణను రెండు వారాలపాటు పొడగించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత అక్కడ 5జీ టవర్స్ ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది. కొన్ని కీలక విమానాశ్రయాల్లో "విమానాశ్రయ రన్ వేలకు సుమారు 2 మైళ్ల (3.2 కిలోమీటర్ల)లోపల మినహా దేశంలో ప్రతిచోటా 5జీ అమలు చేయాలని" విమానయాన సంస్థలు కోరుతున్నాాయి. (చదవండి: కష్టకాలంలో శ్రీలంకకు మరోసారి అండగా నిలిచిన భారత్..!) -
గిట్టుబాటు ధర అందేలా కృషిచేస్తా
సాక్షి, హైదరాబాద్: పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని శుక్రవారం రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు ఆయనను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తాను సమర్ధవంతంగా పనిచేస్తాననే నమ్మకంతో కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమన్నారు. త్వరలో రాష్ట్రంలోని సమన్వయ సభ్యులందరితో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతు సమన్వయ సమితి సభ్యుల విధులు, బాధ్యతలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా విజయం సాధిస్తారని చెప్పారు. తెలంగాణ రైతులు అదృష్టవంతులని హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. సమితి చైర్మన్‌గా రాజేశ్వర్‌రెడ్డి రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకముందన్నారు. పల్లా బాధ్యతల స్వీకారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు సమస్వయ సభ్యు లు అభినందనలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు పాల్గొన్నారు. -
అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా ఎంతో కృషి చేశారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. ఝా పదవీ విరమణ సందర్భంగా బుధవారం అరణ్యభవన్‌లో ఏర్పాటుచేసిన వీడ్కోలు సభకు మంత్రి ఇంద్రకరణ్, సీఎస్ ఎస్కే జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీకే ఝాకు మంత్రి, సీఎస్, ఇతర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కొత్త పీసీసీఎఫ్(ఇన్చార్జ్) ఆర్.శోభకు అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ మూడేళ్లకుపైగా అటవీ సంరక్షణ ప్రధాన అధికారి హోదాలో పనిచేసిన అతి కొద్ది మం ది ఐఎఫ్ఎస్లలో ఝా ఒకరని అన్నారు. అటవీ సంరక్షణ విషయంలో ఆయన అంకితభావంతో పని చేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరంతోసహా అనేక ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు రికార్డు వేగంతో సాధించేలా తన బృందంతో కలిసి కృషి చేశారని చెప్పారు. హరితహారం సమర్థవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించారన్నారు. పీకే ఝా సేవల వల్ల అటవీ శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఇదేస్ఫూర్తితో హరితహారం, అటవీరక్షణకు అటవీ అధికారులు కృషి కొనసాగించాలని సూచించారు. ఝా నేతృత్వంలో అటవీ శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని సీఎస్ ఎస్కే జోషి అన్నారు.రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూముల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసిం చారు. పీకే ఝా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహకారం వల్లే తాను విజయవంతంగా పనిచేయగలిగానని, çసహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అడిషనల్ పీసీసీఎఫ్‌లు మునీంద్ర, డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఫర్గేన్ లోకేష్ జైస్వాల్, సీఎఫ్‌వోలు, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
‘దెబ్బకు దెబ్బ.. నీ పిల్లల్నీ చంపేస్తా..!’
న్యూయార్క్: నెట్ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేయడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ చీఫ్‌పై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నీ కుటుంబాన్ని అంతం చేస్తాన’ని నిందితుడు ఎఫ్‌సీసీ చీఫ్ అజిత్పాయ్ను బెదిరించాడు. ఇంటర్నెట్ సేవల ధరలు పెరుగుతాయనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడనీ, దానికి బాధ్యుడు అజిత్ పాయ్ అని ఆరోపించాడు. అందుకనే ప్రతికారంగా అజిత్ పిల్లలను అంతమొందిస్తానని ఈ మెయిల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంపై వైట్‌హౌస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. నేపథ్యం: ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలపై తటస్థంగా (నెట్ న్యూట్రాలిటీ) వ్యహరించిన ఎఫ్‌సీసీ ఆ విధానానికి జూన్‌లో స్వస్తి పలికింది. ఎఫ్‌సీసీ ప్రతిపాదన మేరకు నెట్ న్యూట్రాలిటీ విధానాన్ని రద్దు చేస్తూ అమెరికా కాంగ్రెస్ తీర్మానం చేసింది. అయితే, నెట్ న్యూట్రాలిటీని రద్దు చేయడంతో అమెరికా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల ధరలు పెరుగుతాయనీ, ఇది వినియోగదారులపై ఆర్థిక భారం మోపనుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో వెబ్సైట్ల మనుగడను ప్రశ్నార్థకం చేసే నెట్ న్యూట్రాలిటీ రద్దుపై ప్రతిపక్ష డెమొక్రటిక్ సభ్యులు ప్రజల్ని రెచ్చగొడుతూ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కాలిఫోర్నియాకు చెందిన మర్కాన్ మన్ మాత్రం.. కేవలం ఎఫ్‌సీసీ చీఫ్ అజిత్ పాయ్ వల్లనే నెట్ న్యూట్రాలిటీ విధానం రద్దయిందనీ, అందుకే అతనిపై పగ తీర్చుకుంటానని హెచ్చరించాడు. -
తొలుత +150 తుదకు -195
27,506 వద్ద ముగిసిన సెన్సెక్స్ రోజులో భారీ హెచ్చుతగ్గులు గరిష్టం 27,850,కనిష్టం 27,475 మెటల్స్‌కు చైనా ఆందోళనల దెబ్బ జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ర్ట ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి అనుకూలంగా వెలువడటంతో తొలుత స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు ఎగసి 27,851 వద్ద రోజులో గరిష్టాన్ని చేరింది. ఆపై చైనా స్టాక్ సూచీ ‘షాంఘై’ 3% పతనంకావడంతో మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్టోబర్‌తో పోలిస్తే చైనా వాణిజ్య లోటు 17.2 బిలియన్ డాలర్ల నుంచి 20.8 బిలియన్ డాలర్లకు పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేపింది. దీనికితోడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆశించిన బిల్లులు ఆమోదం పొందకపోవడంతో దేశీయంగానూ సెంటిమెంట్ బలహీనపడింది. వెరసి ట్రేడింగ్ గడిచేకొద్దీ నష్టాలు పెరిగి సెన్సెక్స్ కనిష్టంగా 27,475ను తాకింది. చివరికి 195 పాయింట్ల నష్టంతో 27,506 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,000 పాయింట్లు పుంజుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు తెలిపారు. నిఫ్టీ 57 పాయింట్లు డౌన్ ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం ఒడిదుడుకుల మధ్య 57 పాయింట్లు నష్టపోయింది. 8,267 వద్ద స్థిరపడింది. చైనా మందగమన పరిస్థితులు మెటల్ షేర్లను దెబ్బకొట్టాయి. సెసాస్టెరిలైట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నాల్కో, హింద్ జింక్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో 3-1.5% మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 2% పతనమైంది. ఇక బ్లూచిప్స్‌లో టాటా పవర్, హెచ్డీఎఫ్సీ, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ, భెల్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, రిలయన్స్ 3-1% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, సిప్లా, భారతీ ఎయిర్టెల్ 3-1.5% మధ్య పురోగమించాయి. నష్టపోయినవే అధికం ట్రేడైన షేర్లలో 1,862 నష్టపోతే, 1,058 బలపడ్డాయి. కాగా, రుణ భారాన్ని తగ్గించుకునే బాటలో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు వాటా విక్రయించేందుకు వీలుగా స్పెషల్ అల్లాయ్ స్టీల్ విభాగాన్ని విడదీసేందుకు నిర్ణయించడంతో ముకంద్ షేరు 11% ఎగసింది. జపనీస్ భాగస్వామ్య సంస్థ ఎఫ్‌సీసీ రికోలో ఉన్న 50% వాటాను ఎఫ్సీసీకి విక్రయించడంతో రికో ఆటో 8% పుంజుకుంది.