సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగియనుండటంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. శనివారం చివరి దశలో ఎన్నికలు జరుగుతున్న 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే పోలింగ్ ఏజెన్సీలు, న్యూస్ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయనున్నాయి. జూన్ ఒకటి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించకుండా న్యూస్ ఛానెల్‌లను ఎన్నికల సంఘం నిషేధించిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.
దేశంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేస్తుందన్న దానిపై అంచనాలను వెల్లడించనున్నాయి. రాజకీయ పండితులు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) విజయం సాధిస్తుందని అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి చివరివరకు గట్టిగా పోరాడటంతో ఎగ్జిట్ పోల్స్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ సొంతంగా 303 స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిసి 352 స్థానాలు గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment