politechnic college
-
ఏకైక లెదర్ ఇనిస్టిట్యూట్..100 శాతం జాబ్ గ్యారెంటీ
రాయదుర్గం: అది రాష్ట్రంలో ఉన్న ఏకైక లెదర్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (పాలిటెక్నిక్). ఇక్కడ చదువుకున్న వారికి 100 శాతం ఉద్యోగాలు గ్యారెంటీ. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ చదివిన వారు చెన్నయ్, నోయిడా, లక్నో తదితర నగరాల్లోనే కాకుండా సౌత్ఆఫ్రికా, ఇంగ్లాండ్, యూఏఈ, సూడాన్ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు మినీ లెదర్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు లేక నాలుగు దశాబ్దాలుగుగా రెండే కోర్సులతో నడుస్తోంది. రాయదుర్గంలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ(జీఐఎల్‌టీ). 1980లో ఏర్పాటైన ఈ ఇనిస్టిట్యూట్‌లో 10 తరగతి పాసై పాలిసెట్ అర్హత సాధించిన వారికి కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. 1980 నుంచి రెండే కోర్సులు... రాయదుర్గంలోని లిడ్‌క్యాప్ ప్రాంగంలో అప్పటి ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతో 1980లో రెండు కోర్సులతో జీఐఎల్‌టీని ఏర్పాటు చేశారు. అందులో ఒకటి డిప్లొమో ఇన్ లెదర్ టెక్నాలజీ కాగా, మరొకటి డిప్లొమో ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఒక్కో కోర్సులో 60 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే మొదట్లో ఆయా కోర్సుల్లో సగం సీట్లు కూడా భర్తీ అయ్యేవి కావు. అయితే ఇటీవలి కాలంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో ఆయా కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే... రాష్ట్రంలోని ఏకైక లెదర్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ గా కొనసాగుతున్న జీఐఎల్‌టీలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఫుట్‌వేర్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అర్హులైన టెక్నికల్ విద్యార్థుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోర్సులే కాకుండా డిప్లోమో ఇన్ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్‌గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్, రిటైల్ అండ్ ఫ్యాషన్ మెర్సన్‌డైజ్ తదితర కోర్సులను కూడా ప్రవేశపెడితే నేటి తరం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మౌలిక వసతుల కల్పనకు కృషి ప్రస్తుతం జిఎల్‌ఐటీలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. కంప్యూటర్ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నాం. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతి గృహాన్ని త్వరలో ప్రారంభిస్తాం. అనంతరం ప్రస్తుత పరిస్థితులు, సాంకేతిక మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రారంభించాలనే ఆలోచిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తాం. గతంలో కంటే ఆదర్శ, ఉపాధి కల్పించే శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.– ఎక్బాల్ హుస్సేన్,ప్రిన్సిపల్ జీఎల్‌ఐటీ రాయదుర్గం -
పాలిసెట్ ఫలితాల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్–2019 ఎంట్రన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1,03,587 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 95,850 (92.53 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్ ఉత్తీర్ణతలో అమ్మాయిలే పైచేయి సాధించారు. 61,505 మంది బాలురకు గాను 55,933 (90.94 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 42,082 మంది బాలికలకు గాను 39,917 (94.86 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. పాలీసెట్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 99.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. 16,704 మంది ఎస్సీ విద్యార్థులకు గాను 16,702 మంది, 9,620 మంది ఎస్టీ విద్యార్థులకు గాను 9,619 మంది పాసయ్యారు. పాలిటెక్నిక్ కాలేజీలకు గుర్తింపు జారీ ప్రక్రియ ఈ నెలాఖరుకు ముగుస్తుందని, మే తొలి వారంలో పాలీసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి చైర్మన్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. జూన్ 1 నుంచి పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. టాప్ ర్యాంకర్లు ఆరుగురు పాలీసెట్‌లో ఆరుగురు విద్యార్థులు 120కు 120 మార్కులు సాధించి 1వ ర్యాంకు సాధించారు. 9 మంది విద్యార్థులు 120కు 119 మార్కులు సాధించగా, వారిలో గణితంలో 60కు 60, భౌతిక శాస్త్రంలో 30కు 30 మార్కులు సాధించిన ముగ్గురికి ఏడో ర్యాంకు కేటాయించారు. గణితంలో 60, రసాయన శాస్త్రంలో 30, భౌతిక శాస్త్రంలో 29 మార్కులు సాధించిన 6 మందికి 10వ ర్యాంకు ఇచ్చారు. టాప్ 15 ర్యాంకులు సాధించిన వారిలో 11 మంది సూర్యాపేట జిల్లా విద్యార్థులే ఉండటం గమనార్హం. -
ట్విస్ట్ : పరీక్ష సరిగా రాయలేదని బ్లేడ్‌తో...
సాక్షి, నల్గొండ : ‘ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!’ ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. పరీక్ష సరిగా రాయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తరుణ్ తనకు తానే బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడే స్వయంగా వెల్లడించాడు. నల్గొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. పరీక్ష సరిగా రాయకపోవడంతో ఇంటికి వెళ్తే తిడతారనే భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతు, చేయి, మర్మాంగాలను కోసుకుని స్పృహ తప్పి రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!
-
ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!
సాక్షి, నల్గొండ : పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల వద్ద ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిపై దుండగులు బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని గొంతు కోసి పరారయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని మాచర్ల తరుణ్ కుమార్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడడంతో తరుణ్ రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు తెలిపారు. -
25నుంచి ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కేటాయించారు. కౌన్సిలింగ్ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరైయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్టు, ర్యాంకుకార్డు, డిగ్రీ, ఇంటర్, పదో తరగతి మార్కుల జాబితా, 9వ తరగతి నుంచి డీగ్రీ వరకూ స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలి. పత్రాలను పరిశీలించుకున్న అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కళాశాలలకు కోసం ఆప్షెన్ను ఇచ్చుకోవచ్చు. ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలించనున్నారు. ఫీజు వివరాలు: ఓసీ, బీసీ అభ్యర్థులకు పరిశీలన రుసుం రూ. 1000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ. 500, ఎన్సీసీ, పీహెచ్, కాప్,స్పోర్ట్స్ కాటరిగీలకు చెందినఅభ్యర్థులు షెడ్యూల్ ప్రాకారం విజయవాడ బెంజిసర్కిల్లోని ప్రభుత్వ పాలిటెన్నిక్ కళాశాలలో ఉంటుంది. వివరాలకు ఏపీఐసెట్. ఎన్ఐసి.ఇన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దళారీలనునమ్మొద్దు: మా కళాశాలలో చే రండి ఫీజులు అవసరం లేదు. మా కళాశాలలో చేరితే ల్యాబ్లాబ్ ఇస్తామని దళారులు చెబుతుంటారు. సంబంధిత విషయాల గురించి అభ్యర్థులు నమ్మి వారికి మీ మొబైల్ నెంబర్ లేదా ఇతర సమాచారాన్ని (ఐసెట్ హాల్‌టికెట్టు నెంబర్, ర్యాంకులను) తెలియజేయవద్దన్నారు. – డాక్టర్ పీకే ప్రకాష్‌రెడ్డి, ఐసెట్ కోర్డినేటర్, కడప