
సాక్షి, నల్గొండ : ‘ఇంటర్ విద్యార్థి గొంతుకోసిన దుండగులు..!’ ఘటనలో కొత్త విషయం వెలుగు చూసింది. పరీక్ష సరిగా రాయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన తరుణ్ తనకు తానే బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడే స్వయంగా వెల్లడించాడు. నల్గొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కలశాల సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కసారాబాద్‌కు చెదిన తరుణ్ స్థానిక ప్రగతి కలశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం పరీక్ష రాసిన అనంతరం స్నేహితుడని ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిన విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వచ్చాడు. పరీక్ష సరిగా రాయకపోవడంతో ఇంటికి వెళ్తే తిడతారనే భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. గొంతు, చేయి, మర్మాంగాలను కోసుకుని స్పృహ తప్పి రాత్రంతా అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు, అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తరుణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment