బాల్య వివాహం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
చింతపల్లి(నల్లగొండ): బాల్య వివాహం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు వివాహన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మొదుగుల మల్లెపల్లి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది.
గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(15)కి నెల్వలపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిపిస్తుండగా.. అక్కడికి చేరుకున్న అధికారులు వివాహాన్ని ఆపి బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.