చిల్లకూరు: పదో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లిదండ్రులు వివాహం చేసే ప్రయత్నం చేయగా సదరు బాలిక విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తిమ్మనగారిపాళెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ కుమార్తెను గూడూరు రూరల్ పరిధిలోని చెంబడిపాళెంకి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే బాలికకు వివాహం ఇష్టం లేకపోవడంతో స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తను కలుసుకుని సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం సూపర్‌వైజర్ క్రిష్ణమ్మ సిబ్బందితో కలసి గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడింది. తర్వాత వారిని ఎస్సై శ్రీనివాసరావు వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment