అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉపాధ్యాయుల పదోన్నతులకు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సోషియల్ స్టడీస్‌లో ఇద్దరు, ఇంగ్లిష్‌లో ఇద్దరు, బయలాజికల్ సైన్స్‌లో ఒకరు, జిల్లా పరిషత్ పరిధిలో ఇంగ్లిష్‌లో ఐదుగురు, గణితంలో ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల, సోషియల్ స్టడీస్‌ల కౌన్సెలింగ్‌ను 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డీఈఓ తెలిపారు.
వాయిదా వేయటం దారుణం
కోర్టు కేసుల పేరు తో కౌన్సెలింగ్ వాయిదా వేయటం దారుణమని వైఎస్సార్‌టీఎఫ్ నాయకుడు ఓబుళపతి పేర్కొన్నారు. లిస్టు ప్రకారం ఇచ్చిన అన్ని ఖాళీలనూ భర్తీ చేయాలని కోరారు. ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎమ్ 35, సోషియల్ స్టడీస్ 27, ఖాళీలు ఏర్పడ్డాయని, వాటి భర్తీ ని సత్వరమే జరపాలని డిమాండ్ చేశారు.
టీచర్ల పదోన్నతులకు కౌన్సెలింగ్
Published Sun, Aug 7 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement
Advertisement