deo anjaiah
-
డిసెంబర్లో ‘హెడ్మాస్టర్ అకౌంట్ టెస్ట్’
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు ‘హెడ్మాస్టర్ అకౌంట్ టెస్ట్’ పరీక్షలు డిసెంబరు 30, 31 తేదీల్లో ఉంటాయని డీఈఓ అంజయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, కడపలో ఉంటాయన్నారు. పరీక్ష ఫీజు రూ.150 చెల్లించి నవంబరు 7లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే రూ.60 అపరాధ రుసుంతో నవంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డీడీఓ కోడ్ 27000303001 మీద చలానా రూపంలో ఎస్బీఐ/ఎస్బీహెచ్ శాఖలలో మాత్రమే ఫీజు చెల్లించాలన్నారు. -
విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి : డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా సైన్స్ సెంటర్లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2016పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి బాలల సైన్స్–2016లో ప్రాజెక్టులు ప్రదర్శించాలన్నారు. ఎన్సీఎస్సీ కో–ఆర్డినేటర్ కె.ఆనందభాస్కర్‌రెడ్డి, సైన్స్ సెంటర్ క్యూరేటర్ సి.వెంకటరంగయ్య పాల్గొన్నారు. రీసోర్స్‌పర్సన్లుగా శామ్యూల్ ప్రతాప్, నారాయణ, నాగరాజు వ్యవహరించారు. -
25 నుంచి జిల్లా స్థాయి ఇన్స్పైర్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల 25, 26, 27 తేదీల్లో అనంతపురంలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్‌సె్పౖర్ అవార్డు మొత్తం రూ.5 వేలు జమ అయిన వారు తప్పనిసరిగా ఈ ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. ఇప్పటిదాకా 160 మంది విద్యార్థులకు రూ.5 వేలు జమ అయిందని, తక్కిన వారికి ఈ వారంలోగా జమ కావచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థుల అకౌంట్లను పరిశీలిస్తూ ఇన్‌సె్పౖర్‌కు సన్నద్ధం చేయాలని సూచించారు. -
15న డిజిటల్ తరగతుల ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో ఈ నెల 15న కనీసం 20 ప్ర భుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభించాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవా లని డీఈఓ అంజయ్య, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి దశరథరామయ్య ఎంఈఓలకు సూచించారు. స్థానిక సైన్స్‌సెంటర్‌లో గురువారం ఎంఈఓలతో సమావేశం నిర్వహిం చారు. డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 15న డిజి టల్ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అధికారి కంగా ప్రారంభిస్తారన్నారు. ప్రతి జిల్లాలోనూ కనీసం 20 పాఠశాలల్లో తరగతులను ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. 6–10 తరగతులకు సంబంధించి సమ్మేటివ్–1 పరీక్షలకు సంబంధించి ఈ నెల 14 నుంచి 18 వరకు మండల స్థా యిలో 5 శాతం జవాబుపత్రాలను పునర్మూల్యాంకనం చే యాల్సి ఉంటుందన్నారు. ఎస్ఎస్ఏ పీఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆధార్‌సీడింగ్ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎమ్మార్సీ ఉద్యోగులు క్లెయిమ్‌లు సకాలంలో పంపితే జీతాలు ఆలస్యం కా కుండా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నా రు. ఏడీలు పగడాల లక్ష్మీనారాయణ, చంద్రలీల, సెక్టోరియల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ప్రశ్నపత్రాల లీకేజీపై డీఈఓ సీరియస్
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో డీవైఈఓ సుబ్బరావు, ఎంఈఓలు గంగప్ప, నాగరాజునాయక్, ఇతర అధికారులు బుధవారం విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. పదోlతరగతి సమ్మేటివ్ అసెస్మెంట్–1 పరీక్ష పత్రాలు లీకేజీ వ్యవహారంపై సా„ì దినపత్రికలో ‘ప్రశ్నపత్రాలు అమ్మబడును’ అనేlశీర్షికతో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డీఈఓ అంజయ్య సీరియస్‌గా పరిగణించి తనిఖీలు నిర్వహించాలని డివిజన్ విద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈమేరకు అధికారులు అన్ని పాఠశాల్లో ప్రశ్నపత్రాల బండిళ్లను పరిశీలించారు. కాగా పట్టణంలోని రవీంద్రభారతి పాఠశాలలో మధ్యాహ్నం జరిగే సోషల్ ప్రశ్నపత్రం–2 ఉదయమే తెరిచినట్లు గుర్తించారు. దీనిపై తీవ్రంగా పరిగణించి డీఈఓ ఆదేశాలతో వారికి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మినట్టు తెలిస్తే చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రతి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల బంyì ళ్లు ప్యాకింగ్ తెరవడానికి హెచ్ఎం, ఆ సబ్జెక్టు ఉపాధ్యాయులు సంతకాలు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. -
పదోన్నతుల్లో పదనిసలు
♦ నిబంధనలకు విరుద్ధంగా సీనియార్టీ జాబితా ♦ ఉపాధ్యాయ సంఘాల నిరసన ♦ కౌన్సెలింగ్‌లో డీఈఓతో వాగ్వాదం ♦ సోషల్, తెలుగు, హెచ్ఎం పోస్టుల భర్తీ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన వివిధ కేటగిరీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం రాత్రి డీఈఓ కార్యాలయంలో డీఈఓ అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన కౌన్సెలింగ్‌లో గొడవ జరిగింది. ఉపాధ్యా సంఘాలు, డీఈఓ మధ్య వివాదం నెలకొంది. ఈ నెల 17న సీనియార్టీ జాబితాను అధికారికంగా ప్రకటించారు. కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే సమయంలో కొందరిని సీనియార్టీ జాబితాలోకి చేర్చారు. సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ఏకంగా ఏడుగురిని అప్పటికప్పుడు సీనియార్టీ జాబితాలో చేర్చారు. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితా వెల్లడించిన రోజు తర్వాత వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయినా వారిని చేర్చడం వెనుక ఆంతర్యమేమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. 1983 నుంచి 1994 డీఎస్సీల వరకు 157 మంది పదోన్నతులు తీసుకోలేదని గుర్తించారు. వీరందరికీ నోటీసులు కూడా ఇచ్చారు. వీరిలో కొందర్ని మాత్రమే సీనియార్టీ జాబితాలో చేర్చి తక్కిన వారిని చేర్చకపోవడాన్ని ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, ఆప్టా, ఎస్‌ఎల్‌టీఏ సంఘాల నాయకులు తప్పుబట్టారు. దీనిపై డీఈఓతో వాగ్వాదానికి దిగారు. చివరకు వారు కౌన్సెలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెల్లిపోయారు. రెండుసార్లకు పైగా పదోన్నతులు తిరస్కరించిన ఐదుగురు టీచర్లు గతంలో కోర్టుకు వెళ్లగా అప్పటి డీఈఓ మధుసూదన్‌రావు 154 జీఓ ప్రకారం వారు పదోన్నతులకు అనర్హులని కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. ఇదే తరహాలో ఉన్న కొన్ని కేసులు ప్రస్తుత కౌన్సెలింగ్‌తో పరిగణపలోకి ఎలా తీసుకుంటారని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయులు (జిల్లా పరిషత్) 6, ఎస్ఏ సోషల్ 9, తెలుగు 3, హిందీ 2, పీడీ 2 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద సోషల్ 23, హెచ్ఎం 3, తెలుగు 3, పీడీ 2, ఫిజికల్సైన్స్ పోస్టును భర్తీ చేశారు. -
ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా ఈనెల 28 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు, స్కూల్ నామినల్ రోల్స్ ఆయా స్టడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆయా స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లను సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని సూచించారు. -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువు పెంచినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లను సంప్రదించి, వారి లాగిన్–ఐడీ ద్వారా తమ దరఖాస్తును ఆన్లైన్ చేయించుకోవాలన్నారు. ఆన్లైన్ చేయించిన తర్వాత వచ్చిన రెఫరెన్స్ నంబర్ ఆధారంగా ప్రవేశ ఫీజును మీసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో చెల్లించాలని కోరారు. -
‘పుష్కరాల’ పోటీల్లో విజేతలు 140 మంది
అనంతపురం ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విద్యార్థులకు 12 అంశాలపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతల వివరాలను బుధవారం ప్రకటించారు. మొత్తం 1610 మంది విద్యార్థులకు 140 మంది విజేతలుగా నిలిచారు. అలాగే ‘కృష్ణా పుష్కరాలు’ అనే అంశంపై ప్రత్యేకంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వ పోటీల్లో 415 మందికి 18 మంది విజేతలుగా నిలిచారు. విజేతల జాబితా డీఈఓ బ్లాగ్ స్పాట్లో ఉంచామని, మండల విద్యాశాఖ అధికారులకు పంపామని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తెలిపారు. -
సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరిసర్కిల్ : జిల్లా సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక అనంత క్రీడాగ్రామంలో మంగళవారం జరిగింది. జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య, ఆర్డీటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ క్రీడలపై చూపుతున్న శ్రద్ధ ఎనలేనిదన్నారు. ఆర్డీటీ సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ కృషి అభినందనీయమన్నారు. అనంతరం జిల్లా సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ సాఫ్ట్‌బాల్ ఎంపికకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరు గుంటూరు జిల్లా మాచర్లలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ, పీఈటీ సంఘం అధ్యక్షులు లింగమయ్య, కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రామకృష్ణ సత్యనారాయణ, కోశాధికారి ఆంజనేయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
జిల్లాలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు
రాప్తాడు : జిల్లాలో 414 మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో అవసరమైన సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను మండలాల వారీగా సమర్పించాలని ఎంఈవోలను డీఈవో అంజయ్య ఆదేశించారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుపై స్థానిక పంగల్ రోడ్డులోని ఆర్డీటీ అంధుల పాఠశాలలో అనంతపురం, గుత్తి డివిజన్ ప్రాంతాలకు చెందిన ఎమ్మీవోలు, హెచ్ఎంలకు మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఐదు తరగతి గదులు, ఐదుగురు ఉపాధ్యాయులను నియమించి ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎస్ఎస్ఏ పీవో దశరథరామయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి పరిచినప్పుడే విద్యార్థులను ఆకర్షించగలమనే ఉద్ధేశంతో ప్రభుత్వం మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేస్తోందని అన్నారు. అనంతరం మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు మూలాలు, ప్రధాన లక్ష్యాలు, మార్గదర్శకాలు, నియామకాలు, నిర్వహణలో అధ్యాపక బృందం పాత్ర తదితర అంశాలపై రిసోర్స్ పర్సన్ విజయ్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో పెనుకొండ డిప్యూటీæడీఈవో సుబ్బారావు, ఎఎంవో చిన్నకృష్ణారెడ్డి, అనంతపురం, గుత్తి డివిజన్ల హెచ్ఎంలు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
టంగుటూరి ప్రకాశం జయంతి నిర్వహించాలి
అనంతపురం న్యూసిటీ: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం నిర్వహించాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. టంగుటూరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. -
టీచర్ల పదోన్నతులకు కౌన్సెలింగ్
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉపాధ్యాయుల పదోన్నతులకు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సోషియల్ స్టడీస్‌లో ఇద్దరు, ఇంగ్లిష్‌లో ఇద్దరు, బయలాజికల్ సైన్స్‌లో ఒకరు, జిల్లా పరిషత్ పరిధిలో ఇంగ్లిష్‌లో ఐదుగురు, గణితంలో ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల, సోషియల్ స్టడీస్‌ల కౌన్సెలింగ్‌ను 15 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. వాయిదా వేయటం దారుణం కోర్టు కేసుల పేరు తో కౌన్సెలింగ్ వాయిదా వేయటం దారుణమని వైఎస్సార్‌టీఎఫ్ నాయకుడు ఓబుళపతి పేర్కొన్నారు. లిస్టు ప్రకారం ఇచ్చిన అన్ని ఖాళీలనూ భర్తీ చేయాలని కోరారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎమ్ 35, సోషియల్ స్టడీస్ 27, ఖాళీలు ఏర్పడ్డాయని, వాటి భర్తీ ని సత్వరమే జరపాలని డిమాండ్ చేశారు. -
రేపు అథ్లెటిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా సెకండరీ పాఠశాల అథ్లెటిక్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈనెల 23న ఉదయం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో ఉంటుందని డీఈఓ అంజయ్య, అసోసియేషన్ కార్యదర్శి సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలల పీఈటీలు ఈ సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు. -
28న విద్యార్థులకు వ్యాసరచన పోటీ
అనంతపురం ఎడ్యుకేషన్ : వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 19న పాఠశాల స్థాయి, 20న మండలస్థాయి, 21న జిల్లాస్థాయిలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ‘చెట్లు – మానవ సర్వతోముఖాభివృద్ధి కారకాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు. 22న గ్రామ, మండలస్థాయిలో వనమహోత్సవ చైతన్య ర్యాలీలు నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
డీఎస్సీ మలిరోజూ ప్రశాంతం!
5871 మంది లాంగ్వెజ్ పండిట్ అభ్యర్థులు హాజరు 919 మంది పీఈటీ అభ్యర్థులు హాజరు ఒక కేంద్రంలో ఉర్దూ మీడియం అభ్యర్థులకు సోషియల్ బదులు గణితం ప్రశ్నపత్రాలు సరఫరా ఆందోళన చెందిన అభ్యర్థులు... తేరుకుని వెంటనే ప్రశ్నపత్రాలు మార్చిన అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 పరీక్షల్లో భాగంగా మలిరోజు ఆదివారం జరిగిన లాంగ్వెజ్ పండిృట్లు, పీఈటీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన లాంగ్వెజ్ పండిట్ల పోస్టులకు మొత్తం 6428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాల వల్ల 293 దరఖాస్తులను తిరస్కరించారు. తక్కిన 6135 మంది హాజరుకావాల్సి ఉండగా... 5871 మంది హాజరయ్యారు. 264 మంది గైర్హాజరయ్యారు. వీరికి 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పీఈటీ పరీక్షకు మొత్తం 1028 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో వివిధ కారణాల వల్ల 56 దరఖాస్తులను తిరస్కరించారు. తక్కిన 972 మంది హాజరుకావాల్సి ఉండగా... 919 మంది హాజరయ్యారు. 53 మంది గైర్హాజరయ్యారు. వీరికి 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.అంజయ్య ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. సోషియల్ బదులు గణితం ప్రశ్నపత్రాలు సరఫరా స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాల కేంద్రంలో ఉదయం జరిగిన పండిట్ల పరీక్షలో కాసింత గందరగోళం నెలకొంది. ఉర్దూ మీడియం సోషియల్ అభ్యర్థులకు సోషియల్ కాకుండా గణితం ప్రశ్నపత్రాలు ఇచ్చారు. కాసేపటికి గమనించిన అభ్యర్థులు ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతో వాదనకు దిగారు. ఇంతలో సమాచారం అందుకున్న డీఈఓ అంజయ్య అక్కడికి ఆఘమేఘాల మీద చేరుకున్నారు. అభ్యర్థులతో మాట్లాడారు. సోషియల్ ప్రశ్నపత్రాలు కల్గిన బండిల్ పక్కనే ఉంది. నిర్వాహకులు వాటిని గమనించక గణితం పేపర్లు ఇచ్చారని గుర్తించారు. వెంటనే వారికి సోషియల్ ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. నేడు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకు... డీఎస్సీ పరీక్షల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్కూల్ అసిస్టెంట్ సబెక్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్) పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 3699 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 16 కేంద్రృలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వెజస్) పరీక్ష జరగనుంది. 18,071 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ మధ్యాహ్నం జరిగే నాన్ లాంగ్వేజస్ పరీక్షకు నగరంతో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలన్నీ నగరానికి దూరంగా ఉంటాయని, అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం ఒంటిగంటకే కేంద్రానికి చేరుకునేలా చూడాలన్నారు. 3 గంటల తర్వాత నిముషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. -
16 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష లు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రాక్టికల్ పరీక్షలు 26 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,146 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 3,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం పది, ఇంటర్ విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్ ద్వారా గానీ, ఏపీఓపెన్ స్కూల్ వెబ్సైట్ ద్వారా గానీ ఈ నెల 10 వరకు హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా స్థాయిలో ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలనూ నియమించామన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి పరిశీలకులను కూడా నియమించామన్నారు. పరీ క్షలు మొదలైన తర్వాత కేవలం 15 నిముషాల వరకే అభ్యర్థులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.