ప్రశ్నపత్రాల లీకేజీపై డీఈఓ సీరియస్
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో డీవైఈఓ సుబ్బరావు, ఎంఈఓలు గంగప్ప, నాగరాజునాయక్, ఇతర అధికారులు బుధవారం విస్తతంగా తనిఖీలు నిర్వహించారు. పదోlతరగతి సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 పరీక్ష పత్రాలు లీకేజీ వ్యవహారంపై సా„ì దినపత్రికలో ‘ప్రశ్నపత్రాలు అమ్మబడును’ అనేlశీర్షికతో వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డీఈఓ అంజయ్య సీరియస్‌గా పరిగణించి తనిఖీలు నిర్వహించాలని డివిజన్ విద్యాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈమేరకు అధికారులు అన్ని పాఠశాల్లో ప్రశ్నపత్రాల బండిళ్లను పరిశీలించారు.
కాగా పట్టణంలోని రవీంద్రభారతి పాఠశాలలో మధ్యాహ్నం జరిగే సోషల్ ప్రశ్నపత్రం–2 ఉదయమే తెరిచినట్లు గుర్తించారు. దీనిపై తీవ్రంగా పరిగణించి డీఈఓ ఆదేశాలతో వారికి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు అమ్మినట్టు తెలిస్తే చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రతి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల బంyì ళ్లు ప్యాకింగ్ తెరవడానికి హెచ్‌ఎం, ఆ సబ్జెక్టు ఉపాధ్యాయులు సంతకాలు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు.