28న విద్యార్థులకు వ్యాసరచన పోటీ
Published Sun, Jul 17 2016 9:36 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
అనంతపురం ఎడ్యుకేషన్ : వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 19న పాఠశాల స్థాయి, 20న మండలస్థాయి, 21న జిల్లాస్థాయిలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
‘చెట్లు – మానవ సర్వతోముఖాభివృద్ధి కారకాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు. 22న గ్రామ, మండలస్థాయిలో వనమహోత్సవ చైతన్య ర్యాలీలు నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Advertisement
Advertisement