july 28th
-
రోలెక్స్ రింగ్స్ ఐపీవో షురూ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బుధవారం(28న) ప్రారంభం కానుంది. శుక్రవారం(30న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 880–900. ఐపీవోలో భాగంగా రూ. 56 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 75 లక్షల షేర్లను రివెండెల్ పీఈ ఎల్ఎల్సీ విక్రయానికి ఉంచనుంది. తద్వారా మొత్తం రూ. 731 కోట్లు సమకూర్చుకోవాలని రోలెక్స్ రింగ్స్ భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(27న) షేర్లను కేటాయించనుంది. ఐపీవో నిధులను దీర్ఘకాలిక కార్యకలాపాల పెట్టుబడులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఐపీవోకు 16 షేర్లను కనీస లాట్‌గా నిర్ణయించింది. గుజరాత్(రాజ్‌కోట్) కేం ద్రంగా గల కంపెనీ ప్రధానంగా ఫోర్జ్డ్ మెషీన్ పరికరాలను రూపొందిస్తోంది. -
28 నుంచి లంక ప్రీమియర్ లీగ్
కొలంబో: క్రికెట్ అభిమానులను అలరించడానికి మరో టి20 లీగ్ ముస్తాబయింది. శ్రీలంక వేదికగా లంక ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 28న మొదలవుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) ప్రకటించింది. మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్న ఈ ఆరంభ లీగ్... సెప్టెంబర్ 20 వరకు జరుగుతుంది. మొత్తం నాలుగు వేదికల్లో 23 మ్యాచ్‌లు జరుగుతాయని ఎస్ఎల్సీ తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ లీగ్‌లో శ్రీలంక క్రికెటర్లతోపాటు 70 మందికి పైగా విదేశీ క్రికెటర్లు పాల్గొనే అవకాశముంది. -
అరుణతార టీఎన్
సందర్భం : రేపు తరిమెల నాగిరెడ్డి వర్ధంతి అనంతపురం న్యూటౌన్: ‘అనంత’ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఆదర్శవంతమైన జీవితాన్ని సొంతం చేసుకున్న తరిమెల నాగిరెడ్డి.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అణగారిన బడుగుబలహీన వర్గాల ఆప్తబంధువుగా, విలువల కోసం జీవిత గమనాన్ని మార్చుకుని కమ్యూనిçష్టు దిక్సూచిగా నిలచిన నేతగా ఎదిగిన నాగిరెడ్డిది విలక్షణ జీవన విధానం. తెలుగు చరిత్రనే కాదు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాగిరెడ్డి పోరాటం అనంత చరిత్రలో అజరామరం.. అనితర సాధ్యం. సహచరులతో ముద్దుగా కామ్రేడ్ టీఎన్ అని పిలిపించుకునే ఆయన వర్ధంతిని శుక్రవారం నిర్వహించేందుకు జిల్లాలో సన్నాహాలు చేస్తున్నారు. పోరాటాల జీవితం నిత్యమూ నిజమైన కమ్యూనిస్టు వాదిగా ఉన్న తరిమెల నాగిరెడ్డి ఏనాడు అధికార దర్పానికి బానిస కాకుండా ప్రజల వెంటే నడిచారు. ఈ విషయమే ఆయనను రాజకీయ దిగ్గజంగా ఎదిగిన తన బావ నీలం సంజీవరెడ్డిని సైతం ఎన్నికల సంగ్రామంలో ఓడించగలిగింది. 1917 ఫిబ్రవరి 11న తరిమెల గ్రామంలో సుబ్బారెడ్డి, ఆదిలక్షుమమ్మ దంపతులకు జన్మించిన నాగిరెడ్డి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రుషివాలీ విద్యాలయంలో నీలం సంజీవరెడ్డితో కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం పరిమళించిన మనిషిగా అనేక పుస్తకాలను రచించారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ‘యుద్ధం– ఆర్థిక ప్రభావం’ అన్న రచనతో అందరినీ ఆలోచింపజేశారు. 1941లో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకించిన బ్రిటీష్ ప్రభుత్వం... తరిమెల నాగిరెడ్డిని తిరుచురాపల్లి కారాగారంలో బంధించింది. మద్రాసు లెజిస్టేటివ్ అసెంబ్లీ మెంబరుగా, లోకసభ సభ్యునిగా కమ్యూనిస్టు పార్టీ తరుఫున ఎన్నికై నిరుపమాన సేవలందించిన తరిమెల నాగిరెడ్డి 1976లో రహస్య జీవితం గడుపుతూ మరణించారు. రేపు తరిమెల నాగిరెడ్డి సంస్మరణ సభ స్ఫూర్తిదాయక పోరాటాలతో జిల్లా వాసుల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన తరిమెల నాగిరెడ్డి 41వ వర్ధంతితో పాటు కమ్యూనిస్టు అగ్రనేత దేవులపల్లి వెంకటేశ్వరరావు సంస్మరణ సభ శుక్రవారం జరుగనుంది. జిల్లా కేంద్రం అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో సాయంత్రం ఆరు గంటలకు భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (ఎంఎల్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
28న విద్యార్థులకు వ్యాసరచన పోటీ
అనంతపురం ఎడ్యుకేషన్ : వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 19న పాఠశాల స్థాయి, 20న మండలస్థాయి, 21న జిల్లాస్థాయిలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ‘చెట్లు – మానవ సర్వతోముఖాభివృద్ధి కారకాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు. 22న గ్రామ, మండలస్థాయిలో వనమహోత్సవ చైతన్య ర్యాలీలు నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.