
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బుధవారం(28న) ప్రారంభం కానుంది. శుక్రవారం(30న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 880–900. ఐపీవోలో భాగంగా రూ. 56 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 75 లక్షల షేర్లను రివెండెల్ పీఈ ఎల్‌ఎల్‌సీ విక్రయానికి ఉంచనుంది. తద్వారా మొత్తం రూ. 731 కోట్లు సమకూర్చుకోవాలని రోలెక్స్ రింగ్స్ భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(27న) షేర్లను కేటాయించనుంది. ఐపీవో నిధులను దీర్ఘకాలిక కార్యకలాపాల పెట్టుబడులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఐపీవోకు 16 షేర్లను కనీస లాట్‌గా నిర్ణయించింది. గుజరాత్(రాజ్‌కోట్) కేం ద్రంగా గల కంపెనీ ప్రధానంగా ఫోర్జ్‌డ్ మెషీన్ పరికరాలను రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment