అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 54 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. ప్రిన్సిపాళ్లతోపాటు అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులనూ బదిలీ చేశారు. ఈ మేరకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) సుగుణమ్మ ఆధ్వర్యంలో బుధవారం కడపలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బషీర్‌అహమ్మద్‌ను మదనపల్లికి బదిలీ చేశారు. అలాగే రొద్దం ప్రిన్సిపల్ నరహరిప్రసాద్‌ను పామిడికి, తలుపుల మహబూబ్‌బాషాను చిలమత్తూరుకు, మడకశిర బాలప్పను లేపాక్షికి, గుడిబండ సత్యవరప్రసాద్‌ను మడకశిరకు, ముదిగుబ్బ చెన్నకేశవ ప్రసాద్‌ను కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ చేశారు. అలాగే 14 మంది అధ్యాపకులు, నలుగురు పీడీలు, ఎనిమిది మంది లైబ్రేరియన్లు, ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లు, 7 మంది రికార్డు అసిస్టెంట్లు, 8 మంది అటెండర్లు, ల్యాబ్ అటెండర్ ఒకరు బదిలీ అయ్యారు.