► 14న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్
► 29 నుంచి తరగతుల ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జూలై 5వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థుల ర్యాంక్‌ను బట్టి 9వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెసులుబాటు ఉంది. 10, 11 తేదీల్లో చివరగా తమ వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు అవకాశముంది.
14న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. మొదటి దశలో సీటు వచ్చినవారు, రానివారు కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 24 నుంచి రెండోదశ వెబ్ కౌన్సెలింగ్ చేపడతారు. మిగిలిపోయిన సీట్ల భర్తీకి 24, 25 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి వీలు కల్పించారు. 27వ తేదీన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అదేనెల 29 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయి. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా ఆగస్టు 1వ తేదీన ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాలి.
తెలంగాణ ఎంసెట్-16 తొలిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్(ఆప్షన్ల కోసం)
క్ర.సం రోజులు తేదీ ర్యాంకులు
నుంచి వరకు నుంచి వరకు
1 2 05-07-2016 06-07-2016 1 45000
2 2 07-07-2016 08-07-2016 45001 90000
3 2 09-07-2016 10-07-2016 90001 చివరి
4 ఆప్షన్ల మార్పు 10-07-2016 11-07-2016 1 చివరి
5 సీట్ల కేటాయింపు 14-07-2016
6 కళాశాల వద్ద రిపోర్టింగ్‌తోపాటు చలానా ద్వారా ఫీజుల చెల్లింపు 21-07-2016
తెలంగాణ ఎంసెట్-16 తుదిదశ కౌన్సెలింగ్ షెడ్యూల్(ఆప్షన్ల కోసం)
1 ధ్రువపత్రాల పరిశీలన, ఆప్షన్లు 24-07-2016 25-07-2016
2 సీట్ల కేటాయింపులు 27-07-2016
3 తరగతుల ప్రారంభం 29-07-2016