
కౌన్సెలింగ్ కేంద్రాల్లో విద్యార్థుల సందడి
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఐసెట్–2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థులు పోటెత్తారు. ఎస్కేయూలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 350 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 325 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరయ్యారు. గురువారం నుంచి శనివారం వరకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వడానికి నిర్ధేశించారు. గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురంలో 33001– 38500 ర్యాంకు వరకు, ఎస్కేయూలో 38501– 44000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంది.