సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఈసెట్–17 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు 1 నుంచి 4 వేల ర్యాంకుల వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగగా.. 3,072 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,001 నుంచి 10 వేల వరకు ధ్రువ పత్రాల పరిశీలన శనివారం నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ వాణీప్రసాద్ తెలి పారు. ప్రత్యేక కేటగిరీకి (క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్) అభ్యర్థులు (1 నుంచి చివరి ర్యాంకు వరకు) శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని పేర్కొన్నారు.