హైదరాబాద్ : తెలంగాణ ఈసెట్-2015 ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. నేరుగా ఇంజనీరింగ్ సెకెండియర్లో చేరేందుకు నిర్వహించే ఈసెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మొత్తం 38 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అనంతరం 28 వరకు అభ్యంతరాల స్వీకరించి, మే 31న ర్యాంకులు వెల్లడిస్తారు.
కాగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కోరారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్, ఆన్‌లైన్ అప్లికేషన్‌పై ఫొటో అతికించి గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించి తీసుకురావాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గెజిటెడ్ అధికారిచే సంతకం చేయించిన కుల ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలు తీసుకొని రావాలని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి హడావిడి లేకుండా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షకు బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే తీసుకురావాలని కోరారు.
నేడు టీఎస్ ఈసెట్ పరీక్ష
Published Thu, May 21 2015 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement