అద్భుతం.. సేనాపతి మూవీపై మెగాస్టార్‌ రివ్యూ | Chiranjeevi Tweet About Rajendra Prasad Senapathi Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi: అద్భుతం.. అన్నింటికీ మించి ఆయన వినూత్న నటన..

Published Wed, Jan 5 2022 3:09 PM | Last Updated on Wed, Jan 5 2022 3:21 PM

Chiranjeevi Tweet About Rajendra Prasad Senapathi Movie - Sakshi

Megastar Chiranjeevi Review On Rajendra Prasad Senapathi Movie: నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌ అగస్త్య, హర్ష వర్థన్‌, జ్ఞానేశ్వరి, సత్య ప్రకాశ్ కీల‌క‌ పాత్ర‌ల్లో నటించిన చిత్రం సేనాపతి. ఇటీవల ఓటీటీలో విడుద‌లైన‌ ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాకు నిర్మాతగా వ్వవహరించిన సంగతి తెలిసిందే. యువ దర్శ‌కుడు పవన్‌ సాదినేని రూపొందించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్‌ సేనాపతిపై రివ్యూ ఇచ్చాడు.

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్‌

ఈ సినిమాపై చిరు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ట్వీట్‌ చేశాడు. సేనాపతి సినిమా చూశాను. యువ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా తీశాడు.  అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉండేలా ఈ మూవీని మలిచాడు. మంచి అభిరుచికి అద్దంపెట్టే చిత్రాన్ని నిర్మించి యువ నిర్మాతలు సుస్మిత కొణిదెల, విష్ణులకు నా ప్రేమాభినందనలు. అన్నింటికీ మించి సీనియర్‌ నటుడు, న‌ట‌కిరీటి రాజేంద్రప్ర‌సాద్ ఈ సినిమాలో వినూత్న పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ఆయన నటనా ప్రతిభకు ఈ చిత్రం ఓ మచ్చు తనక’ అంటూ మూవీ టీంపై చిరు ప్రశంసలు కురిపించాడు. అంతేగాక ఈ మూవీ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. 

చదవండి: నాకింగా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement