లండన్.. లార్డ్స్ క్రికెట్ స్టేడియం.. జూన్ 25, 1983. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మరచిపోలేని రోజు అది. కపిల్‌దేవ్ సారథ్యంలో ఇండియా క్రికెట్ టీమ్ ఫస్ట్ టైమ్ వరల్డ్‌కప్ సాధించింది. అప్పటి ఆ మధుర క్షణాలను అందరూ చూసి ఉండకపోవచ్చు. మువ్వన్నెల జెండాని రెపరెపలాడించిన ఆ క్షణాలను 36 ఏళ్ల తర్వాత వెండితెరపై చూడబోతున్నాం. ఈ కథాంశంతో హిందీలో ‘1983’ పేరుతో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
‘ఏక్తా టైగర్, భజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలను అందించిన కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రలో రణవీర్‌సింగ్ నటించనున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై విజృంభించే తారలకు ప్లే గ్రౌండ్‌లో రెచ్చిపోవడం అంటే కష్టమే. అందుకే, బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేందుకు రియల్ 1983 ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్‌తో రీల్ ప్లేయర్స్‌కు ట్రైనింగ్ ఇప్పించనున్నారట డైరెక్టర్ కబీర్‌ఖాన్. ఈ చిత్రం రూపొందనుందనే సంగతి బయటికొచ్చింది. కానీ, విడుదల తేదీ ప్రకటించలేదు. 2019 ఏప్రిల్ 5న విడుదల చేస్తామని అఫిషియల్‌గా ఇప్పుడు అనౌన్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment