కపిల్ దేవ్,హార్దిక్ పాండ్యా
మొనాకో: ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ‘పాండ్యాలో ప్రతిభ, సామర్థ్యాలకు కొదవలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో వాటిని చూపించాడు కూడా. వేరొకరితో పోల్చినపుడు అతడిపై ఒత్తిడి పెరుగుతుందనే మాట నిజమే. దానికి బదులు అతడు సహజ సిద్ధమైన ఆట ఆడితే బాగుంటుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మరింత మెరుగుపడితే మంచిది. ఆల్‌రౌండర్లు కూడా రెండింటిలో ఏదైనా ఒక విభాగంలో అత్యుత్తమంగా ఉండాల్సిందే ఎందుకంటే నా దృష్టిలో పాండ్యా బ్యాటింగ్ ఆల్‌రౌండర్.
నేను అతడిని అలాగే చూడాలనుకుంటున్నా.’ అని అన్నారు. పాండ్యా నుంచి ఎక్కువ ఆశిస్తున్నామా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘మనం అతడి నుంచి ఎక్కువగా ఆశిస్తు న్న మాట వాస్తవమే... కానీ ఆ సామర్థ్యం పాండ్యాలో ఉంది. ప్రస్తుత జట్టులో అతడో ఉత్తమ అథ్లెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు. మరో వైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయావకాశాల గురించి మాట్లాడుతూ...‘కోహ్లి దూకు డు, ధోని ప్రశాంతత కలగలిస్తే మన జట్టుకు మంచి చాన్స్ ఉంటుంది’ అని కపిల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment