Pandya hardik
-
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్
-
ఏంటమ్మా పాండ్య ఇలా అయితే కప్పు కష్టమే
-
రాహుల్, పాండ్యాలపై నిషేధం ఎత్తేయండి
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా... క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ)కి లేఖ రాశారు. టీవీ షోలో మహిళలను కించపర్చే వ్యాఖ్యలు చేసినందుకు ఈ క్రికెటర్లిద్దరూ టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌నకు నాలుగు నెలలే ఉన్నందున వీరికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని, వర్ధమాన ఆటగాళ్లైనందున ఓ అవకాశం ఇద్దామని ఖన్నా కోరారు. ‘వారు ఇప్పటికే బేషరతుగా క్షమాపణ కోరారు. విచారణ కొనసాగిస్తూనే, రాహుల్, పాండ్యాలను తక్షణమే జాతీయ జట్టులోకి తీసుకుని న్యూజిలాండ్ పంపాలని సీఓఏ, బీసీసీఐ అధికారులను కోరుతున్నా. ఆ ఇద్దరిది ముమ్మాటికీ తప్పే. అయినప్పటికీ చట్టాలను ఉల్లంఘించిన వారిగా చూడటం తప్పనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని లేఖలో ఖన్నా పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంలో విచారణ కోసం అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు ఖన్నా... బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే అభిప్రాయంతో బోర్డు కోశాధికారి అనిరుధ్ ఛౌదరి సైతం ఖన్నాకు లేఖ రాశారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ద్వారా ఈ మేరకు అధికారాలున్నాయి. కానీ, ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లినందున తదుపరి ఏ చర్యలు తీసుకున్నా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. -
పాండ్యా బ్యాటింగ్‌లో మెరుగుపడాలి
మొనాకో: ప్రస్తుత టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుపడాలని మాజీ ఆల్‌రౌండర్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచించారు. ‘పాండ్యాలో ప్రతిభ, సామర్థ్యాలకు కొదవలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో వాటిని చూపించాడు కూడా. వేరొకరితో పోల్చినపుడు అతడిపై ఒత్తిడి పెరుగుతుందనే మాట నిజమే. దానికి బదులు అతడు సహజ సిద్ధమైన ఆట ఆడితే బాగుంటుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి మరింత మెరుగుపడితే మంచిది. ఆల్‌రౌండర్లు కూడా రెండింటిలో ఏదైనా ఒక విభాగంలో అత్యుత్తమంగా ఉండాల్సిందే ఎందుకంటే నా దృష్టిలో పాండ్యా బ్యాటింగ్ ఆల్‌రౌండర్. నేను అతడిని అలాగే చూడాలనుకుంటున్నా.’ అని అన్నారు. పాండ్యా నుంచి ఎక్కువ ఆశిస్తున్నామా అనే ప్రశ్నకు బదులిస్తూ... ‘మనం అతడి నుంచి ఎక్కువగా ఆశిస్తు న్న మాట వాస్తవమే... కానీ ఆ సామర్థ్యం పాండ్యాలో ఉంది. ప్రస్తుత జట్టులో అతడో ఉత్తమ అథ్లెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు. మరో వైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజయావకాశాల గురించి మాట్లాడుతూ...‘కోహ్లి దూకు డు, ధోని ప్రశాంతత కలగలిస్తే మన జట్టుకు మంచి చాన్స్ ఉంటుంది’ అని కపిల్ అభిప్రాయపడ్డారు. -
ముంబైతోనే రోహిత్, పాండ్యా
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కొనసాగించడం దాదాపుగా ఖాయమైంది. మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఆలోచన లేకుండా ముంబై అట్టి పెట్టుకోనుంది. అతనితో పాటు పాండ్యా సోదరులను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యాతో పాటు 2017 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కృనాల్ పాండ్యాను కూడా ముంబై కొనసాగించనుంది. పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాలను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా జట్టులోకే తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీమ్‌లో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను రిటెయిన్ చేసుకుంటే రూ. 21 కోట్లు (12.5+ 8.5), ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే రూ. 33 కోట్లు (15+11+7) చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముంబై ఇండియన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయని కృనాల్‌ను రూ. 3 కోట్లకే తమతో కొనసాగించుకునేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు. -
మిగతా టెస్టులకూ అదే జట్టు
ముంబై: ఆస్ట్రేలియాతో జరగబోయే మిగతా రెండు టెస్టులకు టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అయితే గాయంతో బాధపడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయడంతో జట్టు సభ్యుల సంఖ్య 16 నుంచి 15కి తగ్గింది. మరోవైపు పుణే టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి రెండో టెస్టు ఆడలేకపోయిన ఓపెనర్ మురళీ విజయ్ను జట్టుతో పాటే ఉంచారు. ఈ నెల 16నుంచి రాంచీలో జరిగే మూడో టెస్టు వరకు అతడు కోలుకోగలడని టీమ్ మేనేజిమెంట్ భావిస్తోంది.