ఐపీఎల్-2023లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మధ్య తీవ్ర వాగ్వదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల మధ్య కరచాలనం చేసుకునే సమయంలో వీరిద్దరి మధ్య మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో వీరిద్దరికి ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా కూడా విధించారు. అదే విధంగా గౌతీ, విరాట్ ప్రవర్తనపై మాజీ ఆటగాళ్లు విమర్శల వర్షం కురిపించారు. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. మైదానంలో కోహ్లి, గంభీర్ ప్రవర్తన తనను చాలా బాధ కలిగించిందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.
"బీసీసీఐ క్రికెటర్లను మంచి ఆటగాళ్ల గానే కాదు, మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దాలి. మైదానంలో ఎలా ప్రవర్తించుకోవాలో నెర్పించాలి. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ ప్రవర్తన నన్ను చాలా బాధ కలిగించింది. ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు. విరాట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతుండగా.. గౌతీ చాలా ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు తన సేవలను అందించాడు.
అంతేకాకుండా గంభీర్ ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నాడు. అటువంటిది వీరిద్దరూ బహిరంగంగా అలా ఎలా ప్రవర్తిస్తారు. కానీ క్రీడాకారులు ఎదో ఒక సమయంలో తమ సహనాన్ని కోల్పోతారు. బ్రాడ్‌మన్, పీలే వంటి దిగ్గజాలు కూడా ఈ కోవకు చెందిన వారే" అని ది వీక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
చదవండి: Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం..
Comments
Please login to add a commentAdd a comment