అత‌డొక అద్భుతం.. ఫ్యూచ‌ర్ ఇండియ‌న్ స్టార్‌: గంభీర్‌ | 'He Got A Really Good Future': Gautam Gambhir Vouches For This India Star | Sakshi
Sakshi News home page

అత‌డొక అద్భుతం.. ఫ్యూచ‌ర్ ఇండియ‌న్ స్టార్‌: గంభీర్‌

Published Sat, Jun 22 2024 8:50 PM | Last Updated on Sun, Jun 23 2024 1:33 PM

'He Got A Really Good Future': Gautam Gambhir Vouches For This India Star

టీ20 వర‌ల్డ్‌క‌ప్‌-2024లో టీమిండియా ఓపెనర్‌గా విరాట్ కోహ్లి విఫ‌ల‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. 

విరాట్‌ కేవ‌లం 29 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో విరాట్ కోహ్లి స్థానంలో ఓపెనర్‌గా భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఛాన్స్ ఇవ్వాల‌ని ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఈ మెగా టోర్నీలో జైశ్వాల్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఈ క్ర‌మంలో జైశ్వాల్‌పై  భార‌త మాజీ ఓపెన‌ర్‌ గౌతం గంభీర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్న గంభీర్‌కు ప్ర‌స్తుత త‌రంలో భార‌త క్రికెట్‌లో అత్యుత్త‌మ క్రికెటర్ ఎవ‌ర‌న్న ప్ర‌శ్న ఎదురైంది. వెంట‌నే గౌతీ ఏమీ ఆలోచించ‌కుండా ట‌క్కున య‌శ‌స్వీ జైశ్వాల్ అని బ‌దులిచ్చాడు.

"ప్ర‌స్తుతం త‌రంలో న‌న్ను బాగా ఆక‌ట్టుకున్న‌ క్రికెట‌ర్ యశస్వి జైస్వాల్‌. జైశ్వాల్ అద్బుత‌మైన ఆట‌గాడు. అత‌డికి దూకుడుగా ఆడే స‌త్తా ఉంది. అంతేకాకుండా అత‌డు ఓపెన‌ర్‌గా కూడా బాగా రాణిస్తున్నాడు.

 లెఫ్టాండ‌ర్ కావ‌డం య‌శస్వీకి బాగా క‌లిసొచ్చింది. అత‌డికి మంచి భ‌విష్య‌త్తు ఉంది. జైశ్వాల్‌కి క‌ష్ట‌ప‌డేత‌త్వం ఉంది. క‌చ్చితంగా అత‌డు ఫ్యూచ‌ర్ ఇండియ‌న్ స్టార్‌గా ఎదుగుతాడ‌ని" గంభీర్ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement