Virat Kohli-Gambhir: క‌లిసిపోయిన గంభీర్‌, కోహ్లి.. హగ్ చేసుకుని మ‌రి! వీడియో వైర‌ల్‌ | RCB Vs KKR: Virat Kohli And Gautam Gambhir Fight End After A Decade, Hug Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Virat Kohli-Gautam Gambhir Hug Video: క‌లిసిపోయిన గంభీర్‌, కోహ్లి.. హగ్ చేసుకుని మ‌రి! వీడియో వైర‌ల్‌

Published Fri, Mar 29 2024 10:55 PM | Last Updated on Sat, Mar 30 2024 11:28 AM

Virat Kohli-Gambhir End Fight After A Decade - Sakshi

PC: Ipl.com

టీమిండియా స్టార్ బ్యాటర్  విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడు వారిద్ద‌రూ క‌లిసిపోయారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆర్సీబీ, కేకేఆర్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.  ఈ మ్యాచ్‌ స్ట్రాటజిక్ టైమ్‌లో గౌతం గంభీర్, కోహ్లి ఇద్ద‌రూ ఒకరినొకరు అప్యాయంగా ప‌లక‌రించుకుంటూ హగ్ చేసుకున్నారు. 

దీంతో వారిద్ద‌రి మ‌ధ్య 11 ఏళ్ల‌గా కొనసాగుతున్న వైరానికి తెర‌ప‌డింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజ‌న్లు త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, ఎప్పుడు మీ ఇద్ద‌రూ ఇలానే క‌లిసి ఉండాల‌ని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌గా.. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్- ఆర్‌సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ త‌ర్వాత 2015 ఐపీఎల్ సీజన్‌లో మ‌ళ్లీ విరాట్‌, గౌతీ మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్‌సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

దీన్ని తట్టుకోలేకపోయిన గౌతమ్ గంభీర్, డగౌట్‌లో కూర్చీని తన్ని, ఫైన్ కూడా కట్టాడు. అనంత‌రం 2023 ఐపీఎల్ సీజన్‌లో మరోసారి విరాట్ , గంభీర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. న‌వీన్ ఉల్ హాక్‌-కోహ్లి మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌గా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవ‌డంతో ఆ గొడ‌వ మరింత తీవ్ర‌మైంది. అయితే మ‌ళ్లీ ఏడాది త‌ర్వాత ఇద్ద‌రూ ఒకే మైదానంలో ఉండ‌డంతో అంద‌రి క‌ళ్లు ఈ మ్యాచ్‌పైనే ఉన్ను. కానీ  అంద‌రి ఊహల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఇద్ద‌రూ మంచి మిత్రులయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement