ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్సీబీకి ఎట్టకేలకు రెండో విజయం లభించింది. నిన్న సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన అనంతరం ఆ జట్టుకు వరుస పరాజయాల నుంచి ఊరట లభించింది. నిన్నటి మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన సన్‌రైజర్స్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించి, పరాభావాల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టింది.
మార్చి 25న పంజాబ్‌పై సీజన్ తొలి విజయం సాధించిన ఆర్సీబీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత ఏప్రిల్ 25న మరో విజయం నమోదు చేసింది. ఈ మధ్యలో ఆ జట్టు డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది.
Happiness on Virat Kohli's face after the win. ❤️ pic.twitter.com/RRRZ1ViWux
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024
ఈ విజయం అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా సంబురాలు చేసుకోవడం టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా మారింది. ఏదో టైటిల్ గెలిచినట్లు ఆనందపడిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Cameron Green hugging Virat Kohli. ❤️ pic.twitter.com/Zl4StHBu6b
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024
మ్యాచ్ గెలిచి నెల అవుతుంది కదా.. ఆ మాత్రం ఉంటుందిలే అని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను ఆర్సీబీ వ్యతిరేకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
RCB REGISTERED A WIN IN THEIR 250TH IPL MATCH. 🫡
- A victory against one of the most dangerous sides of IPL 2024. 👌pic.twitter.com/UWn3pZD0OS— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024
నిన్నటి మ్యాచ్‌లో నిదానంగా ఆడినందుకు కూడా విరాట్ కోహ్లి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. విరాట్ వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఆడతాడన్న విషయం మరోసారి రుజువైందని నెటిజన్లు మండిపడుతున్నారు.
The emotional hug between Virat Kohli and Faf Du Plessis after the win. ❤️ pic.twitter.com/cb0PlDhS5z
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024
రజత్ పాటిదార్ పుణ్యమా అని ఆర్సీబీ గెలిచింది కానీ.. ఫలితం తారుమారు అయ్యుంటే మాత్రం ఆర్సీబీ అభిమానులే కోహ్లిని ఏకిపారేసి ఉండేవారు. నిన్నటి మ్యాచ్‌లో పాటిదార్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తే.. విరాట్ 51 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్నాడు.
హాఫ్ సెంచరీకి ముందు విరాట్ చాలా బంతులు వేస్ట్ చేశాడు. అతనిలో వ్యక్తిగత మైలురాళ్లు అధిగమించాలనే ఉద్దేశం స్పష్టంగా బయటపడింది. ఇదే అభిమానులకు చిర్రెత్తిపోయేలా చేసింది.
జట్టు కోసం ఎలా ఆడాలో రోహిత్‌ను చూసి నేర్చుకో అంటూ అభిమానులు చురకలంటిస్తున్నారు. మొత్తానికి మాసం తర్వాత లభించిన విజయానికి అతిగా స్పందించడం.. నిదానంగా ఆడటం వంటి కారణాల చేత విరాట్ నిన్నటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment