టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir)కు మరో ఘోర పరాభవం ఎదురైంది. అతడి నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కోల్పోయింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసిన భారత జట్టు.. 10 ఏళ్ల తర్వాత బీజీటీని టైటిల్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను సైతం భారత్ చేజార్చుకుంది.
ఇక సిడ్నీ టెస్టులో ఓటమి అనంతరం భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి భవిష్యత్తులపై కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ఆడాలా లేదా అన్నది వారి ఇష్టం, నిబద్ధతపై ఆదారపడి ఉంటుందని గౌతీ చెప్పుకొచ్చాడు.
"నేను ఏ ఆటగాళ్ల భవిష్యత్తు గురించి మాట్లడాలని అనుకోవడం లేదు. అది వారి ఇష్టం. వారికి ఆటపై తపన, నిబద్ధత ఉన్నాయి. వారు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చేయగలిగినదంతా చేస్తారని నేను ఆశిస్తున్నాను గంభీర్ పేర్కొన్నాడు.
కాగా పేలవ ఫామ్ కారణంగా ఐదో టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. దీంతో అతడు టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఈ టెస్టు రెండో రోజు ఆట సందర్బంగా ఇప్పటిలో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదని రోహిత్ స్పష్టం చేశాడు.
దేశవాళీ క్రికెట్‌లో అందరూ ఆడాలి
అదే విధంగా దేశవాళీ క్రికెట్‌లో సీనియర్ ప్లేయర్లు ఆడటంపై కూడా గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ప్రతీ ఒక్క ప్లేయర్ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని నేను ఎప్పుడూ సూచిస్తాను. అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరూ రెడ్ బాల్ క్రికెట్‌లో తమ రాష్ట్ర జట్ల తరుపన ఆడాలి. డొమాస్టిక్ క్రికెట్‌లో ఆడితేనే అంతర్జాతీయ స్ధాయిలో మెరుగ్గా రాణించగలము" అని గంభీర్ వ్యాఖ్యనించాడు.
ఇంగ్లండ్ సిరీస్‌కు కోహ్లి ఎంపిక అవుతాడా?
ఇంగ్లండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారా అన్న ప్రశ్న కూడా గంభీర్‌కు ఎదురైంది. "ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. అందుకు తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాము. ఈ విషయం గురించి మాట్లాడానికి ఇది సరైన సమయం కాదు. క్రీడల్లో చాలా విషయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ముందుగానే మనం అంచనా వేయలేమని గంభీర్ బదులిచ్చాడు.
చదవండి: Jasprit Bumrah: చాలా బాధగా ఉంది.. కానీ కొన్నిసార్లు తప్పదు
Comments
Please login to add a commentAdd a comment