ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఘోర పరాజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో టీమిండియా కోల్పోయింది.162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు డిఫెండ్ చేసుకోలేకపోయింది.
మూడో రోజు ఆటకు స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో భారత బౌలింగ్ యూనిట్ తేలిపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా తత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఓడిపోయినప్పటికి తమ జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచందని బుమ్రా చెప్పుకొచ్చాడు.
"కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం తీవ్ర నిరాశపరిచింది. అంతేకాకుండా గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడం కాస్త అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరానికి ప్రధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.మన శరీరంతో మనం పోరాడలేం.
ఈ సిరీస్‌లోనే బాగా బౌలింగ్‌కు అనుకూలించిన వికెట్‌పై బౌలింగ్ చేసే అవకాశాన్ని కోల్పవడం బాధగా ఉంది. మొదటి ఇన్నింగ్స్ నా సెకెండ్ స్పెల్ సమయంలోనే కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో మా కుర్రాళ్లతో చర్చించి బయటకు వెళ్లిపోయాను. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా ఒక బౌలర్ లోటుతోనే ఆడాము.
అయినప్పటకి మిగితా బౌలర్లు బాధ్యత తీసుకుని అద్బుతంగా రాణించారు. ఈ రోజు ఉదయం కూడా మా బౌలర్లతో మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాను. ఆఖరి ఇన్నింగ్స్‌లో కూడా అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని వారితో చెప్పాను. ఏదమైనప్పటికి ఆస్ట్రేలియాకు మేము గట్టిపోటీ ఇచ్చాము. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగింది. ఈ సిరీస్ ఏకపక్షంగా సాగలేదు. మేము ఆఖరి వరకు అద్బుతంగా పోరాడాము. టెస్టు క్రికెట్ అంటే ఇలానే ఉంటుంది.
గేమ్‌లో ఉండాలంటే ప్రత్యర్ధిపై ఒత్తిడికి గురిచేయడం, పరిస్థితికి అనుగుణంగా ఆడటం వంటివి చాలా ముఖ్యమైనవి. ఈ సిరీస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. భవిష్యత్తులో అవి కచ్చితంగా ఉపయోగపడతాయి. మా జట్టులో చాలా మంది కుర్రాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.
వారు కూడా లా అనుభవాన్ని పొందారు. ఈ సిరీస్‌తో టీమ్‌లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని ప్రపంచానికి చూపించాము. కుర్రాళ్లు గెలవలేదని నిరాశతో ఉన్నారు. కానీ ఈ ఓటమిని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకుంటారు. ఇక విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు కూడా అద్బుతంగా పోరాడరని" పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో బుమ్రా పేర్కొన్నాడు.
He was devastating at times, so it's no surprise to see Jasprit Bumrah named the NRMA Insurance Player of the Series. #AUSvIND pic.twitter.com/7qFlYcjD2d
— cricket.com.au (@cricketcomau) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment