అట్టహాసంగా వెంకటస్వామి స్మారక టీ20 లీగ్‌ | venkataswamy memorial telangana t-20 league starts on saturday | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 4 2018 10:18 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

 venkataswamy memorial telangana t-20 league starts on saturday - Sakshi

టోర్నీ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న కపిల్‌ దేవ్‌

సాక్షి, హైదరాబాద్‌ : వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్‌) లీగ్‌ శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్‌ దేవ్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో పాటు సినీతారలు వెంకటేశ్, శ్రీకాంత్, నిర్మాత డి. సురేశ్‌బాబు, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్, 10 జిల్లా జట్ల యజమానులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, మెదక్‌ మావేరిక్స్‌ తలపడ్డాయి. ఈ నెల 25న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నమెంట్‌ ముగుస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement