g venkataswamy
-
అట్టహాసంగా వెంకటస్వామి స్మారక టీ20 లీగ్
సాక్షి, హైదరాబాద్ : వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్) లీగ్ శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు సినీతారలు వెంకటేశ్, శ్రీకాంత్, నిర్మాత డి. సురేశ్‌బాబు, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి. వివేకానంద్, 10 జిల్లా జట్ల యజమానులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో రంగారెడ్డి రైజర్స్, మెదక్ మావేరిక్స్ తలపడ్డాయి. ఈ నెల 25న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. -
ఘనంగా కాకా 87వ జయంతి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి(కాకా) 87వ జయంతి వేడుకలను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న వెంకటస్వామి విగ్రహానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ కార్మికులు, దళితజాతి కోసం కాకా ఎనలేని కృషిచేశారన్నారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. షేర్వానీ దుస్తులతో హైదరాబాద్ బ్రాండ్‌ను మరింత పెంపొందించారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్వరాష్ట్రకాంక్షను కాకా బలంగా కోరుకున్నారనీ, అందుకు పోరాటం చేశారనీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దళితుల ఉన్నత విద్యకోసం అంబేడ్కర్ విద్యాసంస్థలను నెలకొల్పి మార్గదర్శనం చేశారన్నారు. రాజకీయాల్లో తనకు కాకా తండ్రిలాంటి వారని ఎంపీ కె.కేశవరావు కొనియాడారు. కార్మికశాఖ మంత్రిగా కాకా ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కాకా సహకారం వల్లే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని ఎంపీ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి కుమారులు మాజీ మంత్రి జి.వినోద్, మాజీ ఎంపీ జి.వివేక్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని వెంకటస్వామి కుటుంబసభ్యులు శాలువ, జ్ఞాపికతో సన్మానించారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ కాకా అభిమానులు నినాదాలిచ్చారు. -
కాంగ్రెస్‌లో చేరిన కాకా తనయులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరారు. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వివేక్ అన్నారు. కాగా తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గిందని విమర్శించారు. గతంలో తెలంగాణ కోసమే కాంగ్రెస్‌ను వీడామని, తెలంగాణ ఇచ్చినందున మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నామని చెప్పారు. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు. వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
సోనియాతో కాకా తనయుల భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో చేరే విషయంపై సోనియా, వివేక్ బ్రదర్స్ మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. సోనియా వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వనించారని, ఇదే రోజు వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. కాసేపట్లో కాకా తనయులు మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశముంది. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్‌కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. ఎంపీ వివేక్, రాజ్యసభ మాజీ సభ్యుడు కె కేశవరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంలు కాంగ్రెస్ పార్టీని వీడి గతేడాది జూన్ 2 న టీఆర్ఎస్ లో చేరారు. అయితే అప్పట్నుంచే వివేక్ పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తున్నారు. -
సొంతగూటికి నేడు వివేక్ బ్రదర్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు తిరిగి సొంతగూటికిచేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, ఇక వారి చేరిక లాంఛనమే అని సమాచారం. వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్నీ అనుకూలిస్తే సోమవారం వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటారని తెలిసింది. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సుమారు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందో దిగ్విజయ్‌కు వివేక్ వివరణ ఇస్తూ.. తెలంగాణపై మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్న తాము హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకే పార్టీని వీడామని వివరించారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన దిగ్విజయ్, పార్టీలో చేరేందుకు సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో వివేక్ సిట్టింగ్ స్థానమైన పెద్దపల్లి ఎంపీతో పాటు, వినోద్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు దిగ్విజయ్ నుంచి హామీ లభించినట్లు సమాచారం. స్పష్టమైన హామీ లభించడంతో ఇద్దరు నేతలు పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇదే సమయంలో వివేక్ సోదరులు టీఆర్ఎస్తో పొత్తులపై జరిపిన చర్చలు మాత్రం విఫలమయ్యాయని తెలుస్తోంది. దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతున్న సమయంలో ఇంకా చర్చలకు తావులేదని దిగ్విజయ్ స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో చేరే విషయమైనా, మరే నిర్ణయమైనా సోమవారం వెల్లడిస్తానని ఎంపీ వివేక్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరాలని తనపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒత్తిడి ఉందన్నారు.