మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష(gongadi trisha) అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వరుసగా రెండోసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను త్రిష అందించింది. ఏడు ఇన్నింగ్స్‌లలో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా త్రిష నిలిచింది.
అంతేకాకుండా బౌలింగ్‌లోనూ తొమ్మిది వికెట్లతో త్రిష సత్తా చాటింది. ఇక భారత్ వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన త్రిష సోమవారం ఆర్ద రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. స్వదేశానికి చేరుకున్న త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు ద్రితి కేసరి,టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా తమ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో త్రిష మాట్లాడారు.
"అండర్ 19 వరల్డ్ కప్‌లో మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో ఆడుతున్నప్పటికి నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్‌లో నా పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాను అని త్రిష పేర్కొంది.
మరోవైపు తన సహచర ప్లేయర్ ద్రితిపై త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. "ద్రితి అద్భుతమైన ప్లేయర్. కానీ జట్టు కూర్పు వల్ల ఆమెకు ఈసారి ఆడే అవకాశం లభించలేదు. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆమె అద్భుతాలు సృష్టిస్తుందని" త్రిష కొనియాడింది.
ద్రితి మాట్లాడుతూ.. "తొలుత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం కాస్త బాధగా అన్పించింది. కానీ రెండు మ్యాచ్‌ల తర్వాత దేశం కోసమే ఆలోచించాను. భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన టీమ్‌లో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో అద్బుతంగా రాణిస్తాన్న నమ్మకం నాకు ఉంది. ఈ టోర్నీలో త్రిష తీవ్రంగా శ్రమించింది" అని చెప్పుకొచ్చారు.
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Gongadi Trisha, the Player of the Tournament, of #U19T20WorldCup receives a grand welcome at #Hyderabad Airport.
HCA President Jagan Mohan Rao extended a grand welcome to the Women's Under-19 T20 World Cup star cricketers #GongadiTrisha, Drithi Kesari, Head Coach Nooshin and… pic.twitter.com/4P4yup74L4— Surya Reddy (@jsuryareddy) February 4, 2025
Comments
Please login to add a commentAdd a comment