హైదరాబాద్: మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు చుక్కెదురైంది. మాజీ అధ్యక్షుడు వివేక్ వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. శుక్రవారం వివేక్ నామినేషన్ వేసే క్రమంలో సస్పెన్స్ నెలకొన్నప్పటికీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్న్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్ అనర్హుడని భావించడంతోనే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం.
వివేక్‌కు సంబంధించిన ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ కేసు ఒకటి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దానిపై ఇంకా ఎలాంటి తుది తీర్పు రాకపోవడంతో వివేక్ హెచ్‌సీఏ ఎన్నికకు దూరం కావాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్‌కు లైన్‌క్లియర్ అయ్యింది. రెండేళ్ల క్రితం హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినా అది తిరస్కరణకు గురికావడంతో అప్పట్లో అజహరుద్దీన్‌కు నిరాశే ఎదురైంది. అయితే తాజాగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు అజహర్. ఈనెల 27వ తేదీన జరుగునున్న హెచ్‌సీఏ ఎన్నికలో భాగంగా గురువారం అజహర్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment