అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారిపోతున్నాయి. తాలిబన్ల ఆరాచకాలకు ఆఫ్గాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తాలిబాన్ అఫ్గనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్న ఆనంతరం అక్కడి బ్యూటీ పార్లర్లు, జిమ్‌లు ఇతరత్ర షాపులు మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి థియేటర్లను కూడా తాలిబన్లు మూసివేశారు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాల ప్రదర్శనతో కళకళలాడిన ఆఫ్ఘన్ థియేటర్లు తాలిబాన్ రాకతో కళ కోల్పోయాయి. దీంతో బాలీవుడ్‌కు ఆర్థీకంగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి.
చదవండి: ‘ఎన్నిసార్లు ఇలా దర్శనమిస్తావు కియారా’.. అది టాప్‌లెస్ ఫొటో కాదు!
అయితే 90వ దశకంలో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనకు ఆఫ్ఘన్ పెద్ద వినియోగదారుగా ఉండేది. హిందీ సినిమాలు చూడటం అక్కడ కుటుంబ సంప్రదాయంగా ఉండేదంటే.. మన సినిమాలను వారు ఎంతగా ప్రేమించేవారో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అంతేగాక అఫ్గనిస్తాన్ ప్రజలు బాలీవుడ్ చిత్రాలకు, హీరోహీరోయిన్లకు అభిమానులు. అలాగే చాలావరకు హిందీ చిత్రాలు ఆఫ్గనిస్తాన్‌లో చిత్రీకరణ జరిగేవి. అక్కడ ఎన్నో హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. హిందీ సినిమాల పాటలకు అక్కడి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల బాలీవుడ్‌కు పెద్ద ఎదురుదెబ్బన తగిలింది.
చదవండి: నాకు మత్తు ఇచ్చి పోర్న్ వీడియో తీశారు: మాజీ మిస్ ఇండియా యూనివర్స్
తాలిబన్లు సంగీతం, సినిమాలను వ్యతిరేకిస్తుండటంతో బాలీవుడ్ మార్కెట్ పెద్ద మొత్తంలో నష్టపోనుంది. భారతీయ సినిమాలతో ఆఫ్ఘనిస్తాన్‌కు గత 46 ఏండ్లుగా అనుబంధం ఉంది. 1975లో ఫిరోజ్‌ఖాన్, రేఖ, హేమమాలిని నటించిన ‘సెయింట్’ అనే సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఆఫ్ఘన్‌లో జరిగింది. ఇక 1992లో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి నటించిన ‘ఖుదా గవా’ సినిమా షూటింగ్ కాబూల్‌లో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆఫ్ఘన్‌లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండటంతో.. అమితాబ్ బచ్చన్ రక్షణలో ఆఫ్ఘన్ దేశంలోని సగం వైమానిక దళాన్ని అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ నజీబుల్లా ఉంచారు. అదే సమయంలో అమితాబ్ రాయల్ హానర్ కూడా పొందారు. దీంతో ఆ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆఫ్గన్ ప్రజలు థియేటర్లకు క్యూకట్టారు.
Comments
Please login to add a commentAdd a comment