బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్‌కు గురవుతారు. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు స్వరా భాస్కర్.
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై బాలీవుడ్ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వరా భాస్కర్ తాలిబన్ల దాడుల మీద స్పందిస్తూ ట్వీట్ చేసి.. మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వరా ట్వీట్‌పై నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. తన ట్వీట్‌లో స్వరా ‘‘హిందూత్వ టెర్రరిజం’’ అనే పదాన్ని వాడారు. దీనిపై చాలా మంది నెటిజనుల అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాలిబన్ భీభత్సం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసింది. అయితే అక్కడితోనే ఆగిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణచివేత, అణచివేతకు గురైన వారి గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదు’’ అంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు.
We can’t be okay with Hindutva terror & be all shocked & devastated at Taliban terror.. &
— Swara Bhasker (@ReallySwara) August 16, 2021
We can’t be chill with #Taliban terror; and then be all indignant about #Hindutva terror!
Our humanitarian & ethical values should not be based on identity of the oppressor or oppressed.
ఈ ట్వీట్‌పై నెటిజనులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ‘‘స్వరా భాస్కర్ మరోసారి మా మనోభావాలను దెబ్బ తీశారు.. ఆమె కావాలనే ప్రచారం పొందడం కోసం హిందూత్వాన్ని వాడుకుంటుంది.. ఆమె ట్విటర్ అకౌంట్‌ని సస్పెండ్ చేసి.. అరెస్ట్ చేయండి’’.. ‘‘ఆమె హిందూత్వ ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంది. అయితే ప్రభుత్వం ఓ పని చేయాలి. స్వరాను 6 నెలల పాటు అఫ్గనిస్తాన్ పంపించాలి. అక్కడ ఆమె తాలిబన్ల ఉగ్రవాదాన్ని రుచి చూస్తుంది.. దాంతో ఆమెకు రెండింటి మధ్య తేడా అర్థం అవుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. స్వరా భాస్కర్‌ను అరెస్ట్ చేయండి అనే హాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment