
యాంకర్, నటి అనసూయ ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టిన అది చర్చనీయాంశమవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు ప్రశంసించే వారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు సైతం అదే స్థాయిలో ఉన్నారు. అందుకే అనసూయ పెట్టే ప్రతి పోస్ట్ వార్తల్లో నిలుస్తుంది. ఇక నెట్టింట అనసూయ చేసే సందడి గురించి తెలిసిందే. ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ‘పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మీకు ఇదంతా అవసరమా ఆంటీ?’ అంటూ అనసూయ పోస్ట్స్‌పై నెటిజన్లు ట్రోల్స్‌కు దిగుతారు.
చదవండి: రానా నాయుడు వెబ్ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం!
దీంతో వారి కామెంట్స్‌కి ఆమె స్పందిస్తూ గట్టి కౌంటరిస్తుంది. ఆయనప్పటికీ ట్రోలర్స్ మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. ఆమె ఏ పోస్ట్ పెట్టిన దానిపై అభ్యంతకరంగా కామెంట్స్ చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో అనసూయ షేర్ చేసిన తాజా పోస్ట్ చూసి ట్రోలర్స్ కంగుతిన్నారు. తనని ట్రోల్స్ చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా అనసూయ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాదఁఖ పోలీసులు సామాజీక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన న్యూస్‌ను అనసూయ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
చదవండి: శ్రీరామ నవమి సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆదిపురుష్ టీం
ఇక దీనిపై కూడా ట్రోలర్స్ తమదైన శైలిలో స్పందిస్తూ అనసూయను ట్రోల్ చేస్తున్నారు. మరోసారి ఆంటీ అంటూ అభ్యంతకర కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా మహిళలపై వేధింపులు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా ట్రోలర్స్ ఆటలు కట్టించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్‌లో ట్రోలింగ్ చేసినా, ఫొటోలు మార్ఫింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఇటీవల మీడియాతో పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి కేసులు ఏం వచ్చిన వదలకుండ వాటిపై క్రైం పోలీసులు ఫోకస్ పెడుతున్నారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 29, 2023
Comments
Please login to add a commentAdd a comment