బాహుబలి ట్విట్టర్ రివ్యూ | baahubali movie twitter review | Sakshi
Sakshi News home page

బాహుబలి ట్విట్టర్ రివ్యూ

Published Fri, Jul 10 2015 2:31 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలి ట్విట్టర్ రివ్యూ - Sakshi

బాహుబలి ట్విట్టర్ రివ్యూ

ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెండు సంవత్సరాలకు పైగా తీసిన బాహుబలి సినిమాపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అయితే.. ‘‘రాజమౌళి భారతదేశంలో ఉన్న దర్శకులందరికీ బాబు లాంటి వాడు!!!!! మన కాలంలో వచ్చిన అద్భుతమైన మాస్టర్ పీస్ లో ఒక భాగం అయినందుకు చాలా గర్వంగాను, గౌరవంగాను ఉంది!!!’’ అని ట్వీట్ చేశారు.
 
ఇక హిందీలో ఈ సినిమాను చూసిన ప్రముఖ సినిమా ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయనేమన్నారో ఆయన ట్వీట్లలోనే..
 
ఎస్ఎస్ రాజమౌళి  తన ఊహలను తెరకెక్కించినట్లుగా ఏ కథకుడూ అంత దగ్గరకు రాలేరు. బాహుబలి నిజంగా మా-స్ట-ర్-పీ-స్. బాహుబలి సినిమాలో ప్రతి ఫ్రేము, ప్రతి సీక్వెన్సు కూడా అద్భుతమే. హాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ సినిమాలతో దీన్ని సులభంగా పోల్చుకోవచ్చు. ఒక మేధావి బుర్ర నుంచి వచ్చిన ముద్ర దీనికి ఉంది. అత్యంత భారీగా ఉన్న సెట్లు, వీఎఫ్ఎక్స్, సౌండు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ... అన్నింటికంటే ముఖ్యంగా వాటర్ టైట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ అద్భుతం కంటే కూడా చాలా ఎక్కువ. బాహుబలి పాత్రధారులు పూర్తి పర్ ఫెక్టుగా ఉన్నారు. ప్రతి నటుడు తమతమ పాత్రల్లో మెరిసిపోయారు. ప్రభాస్, రానా.. మిమ్మల్నిద్దరినీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ఔట్ స్టాండింగ్! బాహుబలి లాంటి సినిమా మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది. భారతీయ దర్శక నిర్మాతలు ఇలాంటి కల కనడానికి, దాని ఫలితం కోసం చూసేందుకు చాలా ధైర్యం చేయాలి. మనం ఓ పెద్ద దూకు దూకాం. బాహుబలిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఈవాళ చెప్పాలంటే అది ‘బాక్సాఫీసు బ్లాక్ బస్టర్’. రేపు ఇది ఒక క్లాసిక్ గా అందరికీ గుర్తుండిపోతుంది.
 
తారాగణం: ప్రభాస్, అనుష్కాశెట్టి, తమన్నా భాటియా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుదీప్, అడివి శేష్, రాకేష్ వర్రే, మేకా రామకృష్ణ
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సమర్పణ: కె.రాఘవేంద్రరావు
సంగీతం: ఎంఎం కీరవాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement