‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ ఇంకా ఎక్కువ బిజీ అయ్యారు. ఫోటోల్లో తప్ప బయట అసలు కనిపించడం లేదు. ‘సాహో’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్ సడెన్‌గా బుల్లితెర మీద ప్రత్యక్షమయ్యారు. స్టార్ వరల్డ్ ఇండియా చానెల్‌లో ప్రసారమవుతోన్న కాఫీ విత్ కరణ్ సీజన్ 6కి హాజరయ్యారు ప్రభాస్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం(23) ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి బాహుబలి టీం రాజమౌళి, రానా, ప్రభాస్‌లు హజరయ్యారు. రానా ఇప్పటికే ‘నం. 1 యారి’ పేరుతో బుల్లితెర మీద ప్రసారమయ్యే ఓ ప్రొగ్రామ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోండగా.. రాజమౌళి కూడా అప్పుడప్పుడు చిన్న తెర మీద ప్రత్యక్షమవ్వడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రభాస్ కూడా వీరి జాబితాలో చేరారు.
ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. టీజర్ చూస్తే షోలో భాగంగా కరణ్ వివాదాస్పద ప్రశ్నలతో బాహుబలి టీమ్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ‘రానా, ప్రభాస్‌లలో ఎవరేక్కువ బ్యాడ్ బాయ్’ అని కరణ్, రాజమౌళిని ప్రశ్నించారు. అందుకు జక్కన్న ప్రభాస్ బ్యాడ్ బాయ్ కానీ అలా కనిపించడు అంటూ సమాధానమిచ్చారు. అలానే కరణ్, ప్రభాస్‌ను హీరోయిన్ అనుష్క శెట్టితో డేటింగ్ రూమర్స్ గురించి అడగ్గా మొదలెట్టేశారా అంటూ ప్రభాస్ చెప్పిన సమాధానం ఆసక్తి రేపుతోంది. ఫైనల్‌గా ‘ఈ షోలో అబద్దం చెప్పారా’ అని కరణ్ అడగ్గా.. అవునంటూ ప్రభాస్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది. ఈ ఆదివారం ప్రసారం కానున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment