బ్లాక్‌ బస్టర్‌గా రాజీ సినిమా | Alia Bhatt, Vicky Kaushal Raazi Heads Towards Blockbuster | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ బస్టర్‌గా రాజీ సినిమా

Published Fri, May 25 2018 4:26 PM | Last Updated on Fri, May 25 2018 5:36 PM

Alia Bhatt, Vicky Kaushal Raazi Heads Towards Blockbuster  - Sakshi

ఆలియా భట్‌

ముంబై : అలియా భట్‌ తాజా చిత్రం ‘రాజీ’ విమర్శకుల ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ. 91.63 కోట్ల వసూళ్లు రాబట్టింది. మొదటి వారంలో రూ. 56.59 కోట్లు, రెండో వారంలో 35.04 కోట్ల కలెక్షన్లు తెచ్చుకున్నట్టు ప్రముఖ సినీ విమర్శకుడు, వాణిజ్య విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు.

ఒక సైనికుడి తల్లి నిజ జీవిత కథ ఆధారంగా ఇండియన్‌ నేవీ మాజీ లెఫ్టినెంట్‌ కమాండర్‌ హరీందర్‌ ఎస్‌ సిక్కా రాసిన ‘‘కాలింగ్‌ సెహమత్‌’’ నవల ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. అలియా భట్‌ సరసన విక్కీ కౌశల్‌ నటించారు. ఈ సినిమాలో అలియా భట్‌ నటనకు అన్నివైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement