హారర్‌ సినిమాకు ఓకే | Alia Bhatt To Collaborate With Dinesh Vijan For A Supernatural Horror Thriller: bollywood | Sakshi
Sakshi News home page

హారర్‌ సినిమాకు ఓకే

Published Wed, Dec 4 2024 3:51 AM | Last Updated on Wed, Dec 4 2024 3:51 AM

Alia Bhatt To Collaborate With Dinesh Vijan For A Supernatural Horror Thriller: bollywood

లవ్‌ స్టోరీ, యాక్షన్, ఫ్యామిలీ, కమర్షియల్‌... ఇలా డిఫరెంట్‌ జానర్స్‌లో సినిమాలు చేశారు ఆలియా భట్‌. అయితే తొలిసారిగా ఆలియా భట్‌ ఓ పూర్తి స్థాయి హారర్‌ ఫిల్మ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్‌ సమాచారం. హిందీలో ‘స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్య’ వంటి హారర్‌ సినిమాల నిర్మాణంలో భాగమైన నిర్మాత దినేష్‌ విజన్‌తో ఆలియా భట్‌ ఇటీవల భేటీ అయ్యారట.

వీరి సమావేశం ఓ హారర్‌ ఫిల్మ్‌ కోసం అని, ఈ విషయమై త్వరలో స్పష్టత రానుందని భోగట్టా. ఇటీవలే యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఆల్ఫా’ను పూర్తి చేసిన ఆలియా త్వరలోనే ‘లవ్‌ అండ్‌ వార్‌’ సినిమా చిత్రీకరణతో బిజీ కానున్నారు. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తర్వాతే ఆలియా హారర్‌ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement