Dinesh Vijan
-
హారర్ సినిమాకు ఓకే
లవ్ స్టోరీ, యాక్షన్, ఫ్యామిలీ, కమర్షియల్... ఇలా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేశారు ఆలియా భట్. అయితే తొలిసారిగా ఆలియా భట్ ఓ పూర్తి స్థాయి హారర్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం. హిందీలో ‘స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్య’ వంటి హారర్ సినిమాల నిర్మాణంలో భాగమైన నిర్మాత దినేష్ విజన్‌తో ఆలియా భట్ ఇటీవల భేటీ అయ్యారట.వీరి సమావేశం ఓ హారర్ ఫిల్మ్ కోసం అని, ఈ విషయమై త్వరలో స్పష్టత రానుందని భోగట్టా. ఇటీవలే యాక్షన్ ఫిల్మ్ ‘ఆల్ఫా’ను పూర్తి చేసిన ఆలియా త్వరలోనే ‘లవ్ అండ్ వార్’ సినిమా చిత్రీకరణతో బిజీ కానున్నారు. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తర్వాతే ఆలియా హారర్ సినిమా మొదలవుతుందని ఊహించవచ్చు. -
మగధీర స్థాయిలో యాక్షన్ సీన్లు రావాలని..
'రాబ్తా' ట్రైలర్ చూసిన అందరికీ టాలీవుడ్ మూవీ 'మగధీర'ను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులను షేక్ చేసింది. ప్రస్తుతం అదే తరహాలో వస్తున్న 'రాబ్తా'ను దర్శకుడు దినేష్ విజన్ తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా బద్లాపూర్, కాక్టెయిల్, ఫైండింగ్ ఫాన్నీ లాంటీ మూవీలను నిర్మించిన దినేష్ తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తారు. యాక్షన్ మూవీ కోసం ఎదురుచూసిన సుశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి స్పందన వస్తోంది. 'రాబ్తా'లో యాక్షన్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో సుశాంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నటుడు తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు. సుశాంత్ పోస్ట్ చేసిన ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్‌గా ధోనీ బయోపిక్‌లో అదరగొట్టిన ఈ యువ హీరో రాబ్తాలో యాక్షన్ సన్నివేశాల కోసం కత్తియుద్ధం నేర్చుకుని తన కళను ప్రదర్శిస్తున్నాడు. ఏది ఏమైనా రాబ్తా మూవీ కోసం 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరి' ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కృతి సనన్, జంటగా నటించిన ఈ మూవీ జూన్ 9న విడుదల కానుందని ఇటీవల మూవీ యూనిట్ తెలిపింది. -
మగధీర స్థాయిలో యాక్షన్ సీన్లు రావాలని..
-
'ప్రతి సినిమాను నా బిడ్డలా భావిస్తా'
ముంబై: తాను చేసే ప్రతి సినిమాను తన బిడ్డలాగే భావిస్తానని బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ చెప్పాడు. తాను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ''అది నా సినిమా, ఆయన ఆ సినిమా డైరెక్టర్' అంటూ చెప్పుకోవడం తనకు నచ్చదంటూ అభిప్రాయపడ్డాడు.. దినేష్ విజన్ నిర్మాతగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వస్తున్న 'బద్లాపుర్' చిత్రంలో వరుణ్ దావన్ నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా వరుణ్ రోడ్ షోలో పాల్గొని సందడి చేశాడు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ఒక సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నామునేది తాను ఆలోచిస్తానని చెప్పాడు. సినిమాలే తన జీవితమని తెలిపాడు. 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ ధావన్ హమ్టీ శర్మ కీ దులన్హీయా, మేయిన్ తేరా హీరో' సినిమాలు చేశాడు. ఇప్పుడు బద్లాపూర్ సినిమాతో ప్రేక్షుకుల ముందుకు వస్తున్నట్టుగా చెప్పాడు.