మగధీర స్థాయిలో యాక్షన్ సీన్లు రావాలని..
'రాబ్తా' ట్రైలర్ చూసిన అందరికీ టాలీవుడ్ మూవీ 'మగధీర'ను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీసు రికార్డులను షేక్ చేసింది. ప్రస్తుతం అదే తరహాలో వస్తున్న 'రాబ్తా'ను దర్శకుడు దినేష్ విజన్ తెరకెక్కిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా బద్లాపూర్, కాక్‌టెయిల్, ఫైండింగ్ ఫాన్నీ లాంటీ మూవీలను నిర్మించిన దినేష్ తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తారు. యాక్షన్ మూవీ కోసం ఎదురుచూసిన సుశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. యాక్షన్ సీన్లు చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మంచి స్పందన వస్తోంది.
'రాబ్తా'లో యాక్షన్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో సుశాంత్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నటుడు తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించాడు. సుశాంత్ పోస్ట్ చేసిన ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్‌గా ధోనీ బయోపిక్‌లో అదరగొట్టిన ఈ యువ హీరో రాబ్తాలో యాక్షన్ సన్నివేశాల కోసం కత్తియుద్ధం నేర్చుకుని తన కళను ప్రదర్శిస్తున్నాడు. ఏది ఏమైనా రాబ్తా మూవీ కోసం 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరి' ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కృతి సనన్, జంటగా నటించిన ఈ మూవీ జూన్ 9న విడుదల కానుందని ఇటీవల మూవీ యూనిట్ తెలిపింది.