‘మరోసారి నా హృదయం ముక్కలైంది’ | Kriti Sanon Says This Broke My Heart Again On Dil Bechara Movie | Sakshi
Sakshi News home page

మరోసారి నా హృదయం ముక్కలైంది: కృతి సనన్‌

Published Mon, Jul 27 2020 2:19 PM | Last Updated on Mon, Jul 27 2020 2:35 PM

Kriti Sanon Says This Broke My Heart Again On Dil Bechara Movie - Sakshi

‘‘ఇది అసలు సమ్మతం కానే కాదు. నా హృదయాన్ని మరోసారి ముక్కలు చేసింది. అయితే చాలా సందర్భాల్లో మానీ రూపంలో నువ్వు సజీవంగా ఉండటం చూశాను. ఆ పాత్రకు ప్రాణం పోశావు. ఎప్పటిలాగే ఏమీ మాట్లాడకుండానే... నిశ్శబ్దంగానే.. నీ హావభావాలతో సన్నివేశాలను అద్భుతంగా పండించావు’’అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. దివంగత హీరో, తన స్నేహితుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమా దిల్‌ బేచారాను వీక్షించిన అనంతరం ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో తన భావాలను పంచుకున్నారు. అదే విధంగా.. తొలి సినిమాతోనే భావోద్వేగ కథనంతో ఆకట్టుకున్నావంటూ దర్శకుడు ముఖేశ్‌ చాబ్రాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజన సంఘీకి కూడా కృతి అభినందనలు తెలిపారు. సినీ జీవితంలో అందమైన ప్రయాణం నీ సొంతం కావాలంటూ ఆకాంక్షించారు. (దిల్‌ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్‌)

కాగా జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డ సుశాంత్‌ చివరి సినిమా దిల్‌ బేచారా శుక్రవారం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అత్యధిక లైకులతో ఈ మూవీ ట్రైలర్‌ రికార్డు సృష్టించగా... ఓటీటీలో 24 గంటల్లోనే 75 మిలియన్లను వ్యూస్‌ దాటేసిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అదే విధంగా ఐఎండీబీలో 10కి 10 రేటింగ్స్ సొంతం చేసుకొని టాప్ రేటేడ్ ఇండియన్‌ మూవీగా నిలిచింది. కాగా 2014లో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు ఇది రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. ఇక విషాదకరమైన క్లైమాక్స్‌తో ముగిసే ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో సుశాంత్‌ ప్రేక్షకులను మరోసారి కంటతడి పెట్టించాడు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ప్రేయసిగా గతంలో వార్తల్లో నిలిచిన కృతి సనన్‌ సినిమా చూసిన సందర్భంగా తన భావాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. (నీ శత్రువు అదే‌: కృతి సనన్‌ భావోద్వేగం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement