'ప్రతి సినిమాను నా బిడ్డలా భావిస్తా'
ముంబై: తాను చేసే ప్రతి సినిమాను తన బిడ్డలాగే భావిస్తానని బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్ చెప్పాడు. తాను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ''అది నా సినిమా, ఆయన ఆ సినిమా డైరెక్టర్' అంటూ చెప్పుకోవడం తనకు నచ్చదంటూ అభిప్రాయపడ్డాడు.. దినేష్ విజన్ నిర్మాతగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వస్తున్న 'బద్లాపుర్' చిత్రంలో వరుణ్ దావన్ నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా వరుణ్ రోడ్ షోలో పాల్గొని సందడి చేశాడు.
ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ఒక సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నామునేది తాను ఆలోచిస్తానని చెప్పాడు. సినిమాలే తన జీవితమని తెలిపాడు. 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ ధావన్ హమ్టీ శర్మ కీ దులన్హీయా, మేయిన్ తేరా హీరో' సినిమాలు చేశాడు. ఇప్పుడు బద్లాపూర్ సినిమాతో ప్రేక్షుకుల ముందుకు వస్తున్నట్టుగా చెప్పాడు.